Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కూతురుగా ఆ పొత్తును వ్యతిరేకిస్తారట!
By: Tupaki Desk | 23 Aug 2018 8:01 AM GMTఏపీ బీజేపీ నేత.. తెలుగోళ్ల ముద్దుబిడ్డ ఎన్టోవోడి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్ది కాలంగా ఏపీలో అధికార టీడీపీ.. కాంగ్రెస్ పార్టీ ల మధ్య పొత్తుకు అవకాశం ఉందన్న మాటపై పలు కథనాలు వస్తున్నాయి. రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి.
ఇలాంటి వేళ.. పురంధేశ్వరి ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తును తాను వ్యతిరేకిస్తానని.. ఎన్టీఆర్ కుమార్తెగా ఆ పని తాను చేస్తానన్నారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో తాను చూడాలని అనుకుంటున్నట్లుగా ఆమె చెప్పారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారని.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన వైనాన్ని ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుమార్తెగా తాను కాంగ్రెస్.. టీడీపీ పొత్తును పూర్తిగా తప్పు పడతానని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ను తన తండ్రి ఎంతగానో వ్యతిరేకించేవారని గుర్తు చేసుకుంటున్న పురంధేశ్వరి.. తానుఏ రీతిలో కాంగ్రెస్ పార్టీలో చేరింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను కేంద్ర మంత్రిగా వ్యవహరించిన వైనాన్ని చిన్నమ్మ ఎందుకు మర్చిపోతున్నారు.
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టే అలవాటు ఉన్న పురంధేశ్వరి 2014 సార్వత్రిక ఎన్నికల వేళలో బీజేపీలోకి వెళ్లటం తెలిసిందే. అక్కడి అధినాయకత్వం ఆలోచనలకు తగినట్లే ఆమె తాజాగా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేని పక్షంలో.. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న విషయాన్ని ఆమె అంతలా ఎలా మర్చిపోతారన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఏమైనా.. తన తండ్రి పేరును తెర మీదకు తీసుకొచ్చిన చిన్నమ్మ తనకు తానే అడ్డంగా బుక్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.