Begin typing your search above and press return to search.
పురందేశ్వరి వి కూడా సేమ్ డైలాగ్సేనా ?
By: Tupaki Desk | 6 Jun 2022 5:30 AM GMTవిజయవాడలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆమె వైఖరి గురివిందగింజనే గుర్తుచేస్తోంది. మీడియాతో ఆమె మాట్లాడుతు ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఏపీలో అరాచకాలు పెరిగిపోతున్న కారణంగా పెట్టుబడులు రావటం లేదని ఆరోపించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దేశం మొత్తం మీద ఏపీ మాత్రమే అప్పుల ఊబిలో కూరుకు పోతున్నట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. దేశం మొత్తం మీద అప్పుల్లో లేని రాష్ట్రం ఒక్కటి కూడా లేదు.
రాష్ట్రాల సంగతిని పక్కన పెట్టేస్తే స్వయంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా 124 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి కేంద్రం అప్పు 65 లక్షల కోట్లయితే గడచిన ఎనిమిదేళ్ళల్లో మోడీ ప్రభుత్వం చేసిన అప్పు 60 లక్షల కోట్ల అప్పు. పురందేశ్వరి లెక్కప్రకారం కేంద్రం కూడా అప్పుల ఊబిలోనే కూరుకుపోతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కేంద్రం గురించి ఎందుకు అంగీకరించటం లేదు ?
ఇక ఏపీ అప్పంటే కరోనా వల్ల సంక్షేమ పథకాల వల్ల అప్పు ఎక్కువైన మాట నిజమే. 2019 నాటికి రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల అప్పుంటే.. దానిని జగన్ 6 లక్షల కోట్లు చేశారు. పాత ముఖ్యమంత్రులు అందరూ కలిపి చేసిన అప్పుకంటే జగన్ ఒక్కడు చేసిన అప్పు చాలా ఎక్కువ.
రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రమని తెలంగాణా విషయంలో ఒకటే కేసీయార్ ఊదరగొట్టింది అందరు విన్నదే. అలాంటి తెలంగాణా ప్రభుత్వం ఇపుడు 4.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇక ప్రతి బీజేపీ పాలిత రాష్ట్రం కూడా లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని పురందేశ్వరి ప్రస్తావించక పోతే జనాలకు తెలీకుండా ఉంటుందా ?
ఇక అరాచకాల వల్లే పెట్టుబడులు రావడం లేదని తెగ బాధపడిపోయారు. పురందేశ్వరి బాధపడుతున్నంత స్ధాయిలో రాష్ట్రంలో అరాచకాలు ఏంటో ఆమె వివరిస్తే బాగుండేది.
ప్రభుత్వంలో ఎవరున్నారనే దానితో సంబంధం లేకుండా శాంతిభద్రతల సమస్య ఉంటునే ఉంటుంది. ఏపీలో అరాచకాలంటే మరి ఉత్తరప్రదేశ్ లో అరాచకాల సంగతేమిటి ? అక్కడ పెట్టుబడులు రావటంలేదా ? ఏపీకి పెట్టుబడులు వస్తున్నది పురందేశ్వరికి కనబడటం లేదా ? ఏదో ప్రతిపక్షం కాబట్టి ఆరోపణలు, విమర్శలు చేయాలి కాబట్టే చేస్తున్నట్లే ఉంది. అంతేకానీ చేసిన ఆరోపణలు, విమర్శల్లో లాజిక్ మిస్సవుతున్న విషయాన్ని గ్రహించలేదు.