Begin typing your search above and press return to search.
చిన్నమ్మ పాఠాలు...సిల్లీగా ఉన్నాయి
By: Tupaki Desk | 8 Oct 2015 5:59 AM GMTబీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తున్న కేంద్ర మాజీ మంత్రి - బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలుగుదేశం అధ్యక్షుడు - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై నేరుగా అటాక్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వల్లే ప్రజలకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఏపీ సర్కార్ సమయానికి నివేదిక పంపించకపోవడంతోనే కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కోసం రాష్ట్రప్రభుత్వం సమయానికి నివేదిక పంపిస్తే ఇప్పటికే నిధుల విడుదల పూర్తయి ఉండేదన్నారు.
ఆంద్రప్రదేశ్‌లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్నా బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజలను తప్పు దారి పట్టించేందుకే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్ష చేపట్టారని పురందేశ్వరి ఆరోపించారు. రాజకీయ లబ్దికోసమే ఇలాంటి ప్రయత్నాలని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అనే పదం లేకున్నా ఏపీని కేంద్రం అన్నివిధాల ఆదుకుంటుందని ఆమె ప్రకటించారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ఆమె ధీమాగా చెప్పారు.
మిత్రపక్షం అని పేర్కొంటూనే ప్రతిపక్షస్థాయిలో పురందేశ్వరి విమర్శలు చేశారని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నివేదికలు పంపడంలో ఆలస్యం జరిగినా...పోలవరంకు జాతీయ హోదా ప్రకటించిన కేంద్రం అందుకు సంబంధించిన ప్రక్రియలు పూర్తిచేయడంతో పాటు నిధులు విడుదల చేయడంలో ఎందుకు అలక్ష్యం వహిస్తోందనే ప్రశ్న కూడా ఎదురువుతోంది.