Begin typing your search above and press return to search.

బాబు చెప్పిన మాటే చెబుతారా చిన్న‌మ్మ‌?

By:  Tupaki Desk   |   7 April 2018 5:30 PM GMT
బాబు చెప్పిన మాటే చెబుతారా చిన్న‌మ్మ‌?
X
ప్ర‌జ‌ల అభిమానం పొంద‌టం అంత తేలికైన విష‌యం కాదు. అలాంటిది కోట్లాది మంది మ‌న‌సుల్ని గెలుచుకోవ‌టం ఒక ర‌కంగా అదృష్ట‌మే. తానేమిట‌న్న‌ది అర్థం కాకున్నా.. ఎన్టీవోడి కుమార్తె అన్న ట్యాగ్ తో పురంధేశ్వ‌రికి ఎంపీ ప‌ద‌విని ప‌ట్టం క‌ట్టేశారు ఆంధ్రోళ్లు. అది కూడా ఒక‌సారి కాదు.. వ‌రుస‌గా రెండుసార్లు. ఇదంతా త‌న కంటే కూడా త‌న తండ్రి ఇమేజ్ త‌న‌ను ఎంపీని చేసింద‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన‌ట్లు చెప్పినా.. త‌ప్పులు మీద త‌ప్పులు చేయ‌టం ఆమెకు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి.

భ‌ర్త ప్రోత్సాహంతో పాటు.. త‌మ‌కున్న కుటుంబ కార‌ణాల‌తో ఎన్నికల బ‌రిలోకి దిగారు పురంధేశ్వ‌రి. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా గెలిచిన ఆమెకు.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మ‌న్మోహ‌న్ కేబినెట్ లో స‌హాయ‌క మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే అంద‌రి మ‌న‌సుల్లో చిన్న‌మ్మ‌గా రిజిష్ట‌ర్ అయిన ఆమె.. త‌న ప‌నితీరుతో మంచిపేరు తెచ్చుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే..రాష్ట్ర విభ‌జ‌న లాంటి కీల‌క అంశానికి వ‌చ్చేస‌రికి ఆమె త్రోటుపాటుకు గుర‌య్యారు. వ‌రుస ప‌ద‌వులు ఇచ్చిన సోనియాకు విధేయురాలిగా ఉండాలా? త‌న‌ను ఆరాధించి..ఆద‌రించిన ఆంధ్రుల హ‌క్కుల కోసం ఫైట్ చేయాల‌న్న విష‌యంలో ఆమె త‌ప్పులు చేశారు.

దీనికి శిక్ష‌గా 2014లో బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆమె ఓట‌మికి గుర‌య్యారు. త‌న‌కు ఎదురైన ఓట‌మితోనైనా చిన్న‌మ్మ‌లో మార్పు వ‌చ్చిందా? అంటే లేద‌నే చెప్పాలి. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ కంటే.. త‌న‌ను అమితంగా ఆరాధించే ఆంధ్రోళ్ల త‌ర‌ఫున పోరాడాల‌న్న చిన్న విష‌యాన్ని ఆమె గుర్తించ‌లేక‌పోతున్నారు.

ఇప్ప‌టికి ఆంధ్రుల త‌ర‌ఫున‌.. వారి హ‌క్కుల కోసం డిమాండ్ చేయాల్సింది పోయి.. తానున్న బీజేపీకి బానిస‌గా మారార‌న్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఐదు కోట్ల మంది ఆంధ్రులు ప్ర‌త్యేక హోదా కోసం త‌పిస్తుంటే.. ఆమె మాత్రం అందుకు భిన్నంగా ప్యాకేజీ మాట‌ను చెబుతున్నారు.

గ‌తంలోనూ ఇలాంటి మాట‌నే చెప్పిన చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎంత న‌ష్టం చేశార‌న్న విష‌యాన్ని పురంధేశ్వ‌రి గుర్తించిన‌ట్లుగా లేదు. మాకు ప్యాకేజీ ఏమీ అక్క‌ర్లేదు.. హోదా ఇస్తే చాలంటున్న ఆంధ్రోళ్ల మాట‌ను త‌న మాట‌గా మార్చుకోవాల్సింది పోయి.. బీజేపీ తొత్తుగా వ్య‌వ‌హ‌రించ‌టంలో లాభం లేద‌న్న విష‌యాన్ని ఆమె మ‌ర్చిపోతున్నారు. ఓప‌క్క‌హోదా సాధ‌న కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూసైనా ఆమె త‌న తీరును మార్చుకుంటే ప‌రిస్థితి.

జ‌గ‌న్ పార్టీ మొద‌లెట్టిన హోదా పోరుతో.. ఏపీలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఈ రోజు హోదా కోసం పోరాడుతున్న ప‌రిస్థితి. అలాంటి వేళ‌.. పాచిపోయిన ల‌డ్డూల్లాంటి ప్యాకేజీ మాట చెప్ప‌టం ద్వారా త‌న ఇమేజ్ ను మ‌రోసారి డ్యామేజ్ చేసుకుంటున్నారు చిన్న‌మ్మ‌. విభ‌జ‌న స‌మ‌యంలో సోనియాకు విధేయురాలిగా ఉండి.. నోరు విప్ప‌ని చిన్న‌మ్మ‌.. ఈసారైనా ప్ర‌జ‌ల మూడ్ ను గుర్తించి.. వారి హ‌క్కుల కోసం పోరాడితే ఫ‌లితం ఉంటుంది. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే 2014లో ఎదురైన చేదు అనుభ‌వం ఆమెకు మ‌రోసారి ఎదురుకాక మాన‌దు.