Begin typing your search above and press return to search.
బాబుకు ఇష్టమైన కంపెనీపై మండిపడ్డ చిన్నమ్మ
By: Tupaki Desk | 23 March 2017 9:43 AM ISTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ జాతీ మహిళా మోర్చ ఇన్ చార్జి - కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి వెనుకబడిన వర్గాల వారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అదే స్పూర్తితో బీజేపీ కూడా నరేంద్ర మోడీకి ప్రాధాన్యత కల్పించిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అభివృద్ధి-సంక్షేమం నిర్ణయంతో ముందుకు సాగినట్లే మోడీ సైతం అదే రీతిలో అడుగులు వేస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 2019 నాటికి అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ బలమైన క్రియాశీలకంగా ఎదగనున్నట్లు పురంధీశ్వరి ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్- తెలంగాణా రాష్ట్రాల్లో తమ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని 2019 ఎన్నికల నాటికి అధికారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని పరిణామాలను విశ్లేషిస్తూ పురంధీశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఎనలేనిదన్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలోని ఏడు మండలాలను రాష్ట్రంలో కలిపిందని పురందీశ్వరి గుర్తు చేశారు. రాష్ట్రానికి పోలవరం జీవధార లాంటిదని అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ట్రాన్స్ టాయ్ కంపెనీ నిర్మాణం చేపట్టిందని, అతి త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సినప్పటికీ నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని పరోక్షంగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పురందీశ్వరి తప్పుపట్టారు. ఆఖరుకు ముఖ్యమంత్రి కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందని అయినా పనులు జరగని స్థాయికి పరిస్థితులు చేరిపోయాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్యాకేజీకి చట్టభద్రత కల్పించారని పురందీశ్వరి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం అంకిత భావంతో పని చేస్తుందన్నారు. ఇప్పటికే రెండు లక్షల 40 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.
నల్లధనాన్ని తిరిగి రాబట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశారని పురందీశ్వరి చెప్పారు. దీనిని భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తే ప్రతిపక్ష పార్టీలు మాత్రం వ్యతిరేకించాయన్నారు. ఆయా పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఉత్తర భారతదేశంలోని నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ మోజార్టీతో గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మంచి మెజార్టీ సాధించడం వలన బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వచ్చిందని పురందీశ్వరి అన్నారు. సుస్థిర పాలన, అవినీతి రహిత పాలన అందించడమే మోడీ ధ్యేయమన్నారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేది నుండి 9 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ వడ్డీలో నాలుగు శాతం , 12 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ వడ్డీలో మూడు శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తున్నట్లు పురందీశ్వరి గుర్తు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/