Begin typing your search above and press return to search.
బాబు సీబీఐ విచారణకు సిద్దమా?
By: Tupaki Desk | 11 Jun 2018 5:15 PM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ నేతలు డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. ప్రధాని మోడీపై టీడీపీ నేతల విమర్శలను నిరసిస్తూ విజయవాడలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. విజయవాడ ధర్నాచౌక్ లో జరుగుతున్న మహాధర్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ - ఎంపీ గోకరాజు గంగరాజు - కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరి - ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో నియంతృత్వం పెరిగిపోయిందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. బీజేపీ నేతలు - కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
మాజీ కేంద్ర మంత్రి పురందీశ్వరి మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసమే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏపీకి చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ కోరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా? అని పురందేశ్వరి సూటిగా ప్రశ్నించారు. పోలవరం పనుల విషయంలో సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్న తీరు చిత్రంగా ఉందని ఆమె అన్నారు. తమ ఒత్తిడి వల్లే పనులు వేగవంతం అయ్యాయని పేర్కొంటున్న చంద్రబాబు...కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నవయుగ సంస్థ ప్రతినిధులను ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన విషయాన్ని మాట మాత్రమైనా చెప్పడం లేదని అన్నారు. ఇదే బాబు ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీలో పరిపాలన గాడి తప్పిందని ఆరోపించారు. ప్రచారం - అవినీతి ఎక్కువ ...చేస్తున్న పని తక్కువ అని ఆయన మండిపడ్డారు. పెన్షనర్లను బెదిరించి మరీ నవనిర్మాణ దీక్షలకు తీసుకొచ్చారన్నారు. పట్టిసీమలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విష్ణు అన్నారు. పంపుసెట్ల విషయంలో రూ.60 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఒక్క క్యూబిక్ మట్టికి రూ.21 వేలు ఇచ్చి రూ.69 కోట్లు స్వాహా చేశారన్నారు.విశాఖలో జరుగుతున్న భూకుంభకోణాలపై సిట్ నివేదిక బయట పెట్టాలన్నారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసినందువల్ల టీడీపీ లబ్ధి పొందిందని - 2019 ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని విష్ణు కుమార్ రాజు అన్నారు. స్వప్రయోజనాల కోసం మధ్యలోనే దోస్తీకి స్వస్తి చెప్పారన్నారు. ప్రత్యేక హోదాపై మాట మార్చారని చంద్రబాబు అనడం సరికాదన్నారు. అసలు ఆయన మొదట ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.