Begin typing your search above and press return to search.
యూపీ నుంచి రాజ్యసభకు పురందీశ్వరి
By: Tupaki Desk | 27 Dec 2017 8:45 AM GMTమాజీ కేంద్ర మంత్రి - ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ దక్కనుందా? రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పురందీశ్వరిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వివిధ మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం నిజమైతే...త్వరలోనే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఆమెకు రాజ్యసభ సీటు కట్టబెట్టనున్నారు.
కేంద్రమంత్రిగా ఉండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ విజయంతో గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మనోహర్ పారికర్ కారణంగా ఖాళీ అయిన సీటులో పురందీశ్వరికి రాజ్యసభ చాన్స్ కల్పించనున్నారని మీడియా కథనాలు వస్తున్నాయి. రాజ్యసభకు ఎన్నికైన పారికర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పార్టీ విజయంతో రక్షణ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. మరోవైపు రాబోయే కొద్దికాలానికి రాజ్యసభ చాన్స్ కోసం పార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ నేతలెవరూ ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో వారు ఉత్తరప్రదేశ్ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఏప్రిల్ మాసంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే ఎనిమిది రాజ్యసభ స్థానాల్లో ఒకటి పురందీశ్వరికి దక్కవచ్చని తెలుస్తోంది.
ఇటు రాష్ట్ర పార్టీ నేతలు ఆసక్తి చూపని నేపథ్యం ఒకవైపు...మరోవైపు పార్టీకి అందిస్తున్న సేవల నేపథ్యంలోఈ అవకాశం ఇవ్వనున్నారు.దీంతో పాటుగా మరో ఆరేళ్ల పాటు పొడగింపు అవకాశం కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పురందీశ్వరికి సైతం అనుకూలమైన పార్లమెంట్ నియోజకవర్గం లేని నేపథ్యంలో...రాజ్యసభకు వెళ్లడమే సరైన నిర్ణయమని అంటున్నారు. 2019లో మోడీ సర్కారు మళ్లీ అధికారంలోకి వస్తే...పురందీశ్వరికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కవచ్చని అంటున్నారు.