Begin typing your search above and press return to search.
విలువలతో పెరిగాం.. కామెంట్లు క్షమార్హం కావంటూ పురంధేశ్వరి ఫైర్
By: Tupaki Desk | 20 Nov 2021 10:09 AM ISTరంగం ఏదైనా సరే పరిధులు.. పరిమితులు ఉంటాయి. వాటిని దాటే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. కానీ.. అలాంటి పని చేశారన్న ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు వైసీపీ నేతలు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వారు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని..అనంతరం తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన చంద్రబాబు విలేకరుల సమావేశంలో భోరమని ఏడ్చేయటం షాకింగ్ గా మారింది.
ఈ ఉదంతంలో నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆమె సోదరి పురంధేశ్వరి స్పందించారు. తన సోదరిపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఆమె తప్పు పట్టారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు దూషించటంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదేమాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇది హర్షించదగ్గ పరిణామం కాదని.. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందన్నారు. అక్కాచెల్లెళ్లుగా ఎన్నో విలువలతో పెరిగామని.. ఇలాంటి ఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమన్న ఆమె.. జరుగుతున్న పరిణామాల్ని అందరూ గమనిస్తున్నారన్నారు. అధికార మదంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరికాదన్న ఆమె.. వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.