Begin typing your search above and press return to search.
సీతయ్య సీటు కోసం చిన్నమ్మ పాట్లు
By: Tupaki Desk | 21 Dec 2015 7:21 AM GMT పురంధేశ్వరి రూటు మారుస్తున్నారా..? చంద్రబాబుతో సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే... అవి సోదరుడు సీతయ్య కోసమేనా వేరే కారణం ఉందా అన్నది తెలుసుకోవడానికి రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు.... ఇప్పుడు టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీలో మహిళా మోర్చా జాతీయ ఇన్ చార్జ్ గా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించడమే ఆమె ప్రధాన ఎజెండా అన్న సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులైనా కూడా చంద్రబాబుతో ఆమె ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఏపీ బీజేపీలో చిన్నచిన్న నేతలు కూడా చంద్రబాబుపై ఎగిరెగిరి పడుతుండడంలో ఆమె హస్తం కూడా ఉందని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి సడెన్ గా స్వరం మార్చారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడి రాజకీయవర్గాలను, ప్రజలను ఆశ్చర్యంలో పడేశారు.
కాల్‌మనీ విషయంలో పురంధేశ్వరి చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు. అది పార్టీలకు అతీతంగా చూడాల్సిన అంశమని... టీడీపీని కౌంటర్ చేయడం తగదన్నట్లుగా మాట్లడారు. మిత్రపక్ష బిజెపి - తెలుగుదేశం పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ రెండు పార్టీల నేతలు కూర్చొని సర్దుబాటు చేసుకుంటున్నారని చెప్పారు. అలాగే నామినేటెడ్ పదవులపై కూడా చర్చిస్తున్నామని పురంధరేశ్వరి వివరించారు. టీడీపీ - బీజేపీల మధ్య ఉన్న వివాదాస్పద అంశాలపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దాంతోపాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలోనూ ఆమె టీడీపీ వైఖరిని సమర్థించడం విశేషం. అసెంబ్లీలో ఆడ - మగ అనే తేడాలేదని, అసభ్యకరంగా ఎవరు మాట్లాడినా వారు శిక్షార్హులేనని చెప్పి చంద్రబాబుకు పరోక్ష మద్దతు ప్రకటించారు.
అయితే... పురంధేశ్వరిలో ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు వచ్చిందన్నదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. తన సోదరుడు హరికృష్ణకు రాజ్యసభ సీటు కోసం చంద్రబాబును ఆమె రిక్వస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజ్యసభ సీటు ప్రయత్నాల్లో భాగంగా హరికృష్ణ ఇటీవల కొద్దికాలంగా చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించే మార్గం కనిపించకపోవడంతో సోదరుడు కోసం పురంధేశ్వరి ఒక మెట్టు దిగాలని నిర్ణయించుకున్నారని... చంద్రబాబును ఆమె హరికృష్ణకు సీటివ్వాలని కోరుతారని భావిస్తున్నారు. ఆ కారణంగా ముందుగా కొంత సానుకూల వాతావరణం ఏర్పరుచుకునే దిశగా ఆమె సపోర్టివ్ గా మాట్లాడుతున్నట్లు భావిస్తున్నారు.