Begin typing your search above and press return to search.

దగ్గుబాటి కుమారుడికి పర్చూర్ టికెట్

By:  Tupaki Desk   |   14 Jan 2019 6:51 AM GMT
దగ్గుబాటి కుమారుడికి పర్చూర్ టికెట్
X
తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు నాయుడు అంటే అస్సలు పడని దగ్గుబాటి పురందేశ్వరి-వేంకటేశ్వరరావులు వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురందేశ్వరి వచ్చే ఏపీ అసెంబ్లీ బరిలో తన కుమారుడు హితేష్ చెంచురామ్ ను దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చిన ఆఫర్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీకి బలమైన క్యాడర్ లేరు. దీంతో ఇప్పటికే ముగ్గురు ఇన్ చార్జులను వైఎస్ జగన్ మార్చారు. ఇటీవలే అక్కడ బలంగా ఉన్న గొట్టిపాటి ఫ్యామిలీ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో తెలుగుదేశం బలంగా తయారైంది. ఇక ఇక్కడ సరైన అభ్యర్థి కోసం వైసీపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

అందుకోసం ఒకప్పుడు పర్చూర్ నుంచి రాజకీయాల్లో వెలుగు వెలిగిన దగ్గు బాటి వేంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ లాబీయింగ్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గుబాటి వేంకటేశ్వరరావుతో భేటి అయ్యి పర్చూర్ టికెట్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ టికెట్ పై తన కుమారుడిని పోటీచేయించేందుకు దగ్గుబాటి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య మళ్లీ దగ్గుబాటి మీడియా ముందుకు వస్తూ, వివిధ ఇంటర్వ్యూల్లో బాబుపై ధ్వజమెత్తుతున్నారట.. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరం అని ప్రకటించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరితే సంచలనమే మరి.. ఆ పార్టీ బలం పుంజుకోవడంతోపాటు టీడీపీకి గట్టి ప్రత్యర్థి లభించనుంది.