Begin typing your search above and press return to search.
రాజధాని..వైఎస్ ఆర్సీపీ వాదనలకు పురందేశ్వరి మద్దతు!
By: Tupaki Desk | 31 Aug 2019 8:02 AM GMTరాజధాని విషయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలకు కేంద్ర మాజీ మంత్రి - భారతీయ జనతా పార్టీ నేత పురందేశ్వరి మద్దతు పలికారు. ఒకవైపు రాజధాని మార్పు అసమంజసం అంటూనే.. రాజధాని వికేంద్రీకరణ మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. రాజధాని అంటూ అమరావతికే అభివృద్ధిని పరిమితం చేయకూడదనే వారు చాలా మందే ఉన్నారు. ఆ వాదననే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వినిపిస్తూ ఉంది.
రాజధానిని అమరావతి నుంచి మార్పు అంటూ ఇంత వరకూ అధికారిక ప్రకటనలు ఏమీ చేయలేదు. అయితే వికేంద్రీకరణ, వివిధ ప్రాంతాల్లో రాజధాని సంబంధిత అంశాలను ఉంచడం గురించి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా కనిపిస్తోంది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత - సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అయితే వికేంద్రీకరణకు ఆయన మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి. జరగబోయేది అదే అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పురందేశ్వరి స్పందన ఆసక్తిదాయకంగా ఉంది. రాజధానిని తరలించకూడదు అంటూనే.. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాట్లు జరగకూడదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
గతంలో అభివృద్ధిని హైదరాబాద్ కు పరిమితం చేశారని - తీరా రాష్ట్ర విభజన అప్పుడు సీమాంధ్ర ప్రాంతం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. ఇప్పుడు అలా జరగకూడదని..రాజధాని విషయంలో వికేంద్రీకరణ మేలని ఆమె వ్యాఖ్యానించారు.
ఇలా భారతీయ జనతా పార్టీ నేత నుంచి వికేంద్రీకరణకు మద్దతుగా వాణి వినిపిస్తోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్లు - జనసేన - కమ్యూనిస్టులు అంతా అమరావతి అమరావతి అని కలవరిస్తూ ఉన్నారు. అక్కడ శాశ్వత నిర్మాణలంటూ ఏ ఒక్కటీ లేకపోయినా రాజధాని మార్పు వద్దంటూ రచ్చ చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తండటం గమనార్హం.