Begin typing your search above and press return to search.
పురంధేశ్వరిది ‘ప్రత్యేక హోదా’యా?
By: Tupaki Desk | 30 Jan 2017 8:03 AM GMTప్రత్యేక హోదా కోసం నవ్యాంధ్రప్రదేశ్ పరితపిస్తోందని తెలుసు.. దేశంలో 11 రాష్ర్టాలకు ప్రత్యేక హోదా ఉందని తెలుసు.. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయనీ తెలుసు.. ఆ నిబంధనలు ఏపీకి వర్తించకపోయినా కేంద్రం విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు హోదా కోరే హక్కుందనీ తెలుసు.. అయినా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏపీ ఆవేదనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్రంలోని ఉత్తరాది నేతల సంగతి పక్కనపెట్టినా అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకే చెందిన ఏపీ నేతలూ సొంత రాష్ట్రానికి అన్యాయం చేసేలా మాట్లాడుతున్నారు. అంతేకాదు... ప్రభుత్వంలో తమకు ఏ పదవీ లేకున్నా... కనీసం ఎంపీగా కూడా లేకపోయినా ప్రత్యేక హోదాపై కీలక నిర్ణయాలే వెలువరించేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు సరికదా.. ఇప్పుడు హోదా అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకు కూడా ఆ హోదా తొలగిస్తామని బీజేపీ మహిళా మోర్చా ఇంఛార్జి పురంధేశ్వరి తాజాగా ప్రకటించారు.
ఇండియాలో వివిధ కారణాల రీత్యా ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న 11 రాష్ట్రాలకు హోదాను నిలిపివేయనున్నామని పురందేశ్వరి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆమె - 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఉండదని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను మించిన లాభాన్నిచ్చే రాయితీలు - అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.
మహిళా మోర్చా ఇంఛార్జి అంటే అది పార్టీలో ఒక శాఖకు నాయకత్వ బాధ్యత మాత్రమే.. కేవలం పార్టీ పదవి. ప్రభుత్వంలో ఆమెకు పదవి లేదు. ఆమె మంత్రి కాదు.. నీతి ఆయోగ్ ఛైర్మన్ కాదు.. ఆమె చెబుతున్నట్లుగా ఆర్థిక సంఘంలోనూ లేరు. కనీసం ఇప్పుడు పార్లమెంటు సభ్యురాలు కూడా కాదు. మరి ఏ హోదాతో ఆమె ఈ ప్రకటన చేశారో ఆశ్చర్యమే. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా తొలగిస్తున్నామని చెప్పడానికి ఆమెకు ఉన్న ప్రత్యేక హోదా ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. పొరుగునే తమిళులు చూపిన జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో నవ్యాంధ్ర ప్రత్యేక హోదా దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో పురందేశ్వరి ఇలా నీరుగార్చే ప్రకటనలు చేయడంపై జనం మండిపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/