Begin typing your search above and press return to search.

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది

By:  Tupaki Desk   |   4 Feb 2019 5:49 PM IST
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది
X
దగ్గుబాటి పురందేశ్వరి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు దగ్గబాటి హితేజ్‌ చెంచురామ్‌ వైసీపీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. అన్నీ పార్టీలను సమానంగా చూస్తున్న కుటుంబం ప్రస్తుతం వీళ్లదే. అయితే.. బీజేపీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి ఇవాళ అనుకోకుండా గడ్డు పరిస్థితి వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. బీజేపీ నాయకురాలిగా ఆమె పాల్గొనడం తప్పనిసరి. అయితే.. అక్కడున్న వారిలో హిందీ ఎవ్వరికీ రాకపోవడంతో అమిత్‌ షా మాట్లాడినదాన్ని తెలుగులో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పురందేశ్వరిపై పడింది.

మొదటి ప్రసంగం మామూలుగానే మొదలైన.. ఆ తర్వాత మాత్రం పురందేశ్వరికి కష్టాలు మొదలయ్యాయి. సాధారణంగా కాంగ్రెస్‌ అంటేనే.. ఒంటి కాలుపై లేచే అమిత్‌ షా..విజయనగరం జిల్లాలో ఆ పార్టీపై నిప్పులు చెరిగారు.2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నకాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏం చేయలేదని - అప్పటి ప్రధాని - మంత్రులు అంతా అసమర్ధులు అంటూ విరుచుకుపడ్డారు. దీంతో.. దాన్ని ప్రజలకు చెప్పేందుకు పురందేశ్వరికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆ టైమ్‌ లో పురందేశ్వరి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. పదేళ్లపాటు కేంద్రమంత్రిగా పనిచేశారు. మొత్తానికి ఏలాగొలా మ్యానేజ్‌ చేసి మమ అన్పించేశారు.