Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ లో దొరికిన డబ్బెంత? ఎక్కడి నుంచి వచ్చింది.. కిషన్ రెడ్డి ప్రశ్న

By:  Tupaki Desk   |   27 Oct 2022 10:15 AM GMT
ఫాంహౌస్ లో దొరికిన డబ్బెంత? ఎక్కడి నుంచి వచ్చింది.. కిషన్ రెడ్డి ప్రశ్న
X
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. డబ్బులు ఇస్తూ దొరికిన ముగ్గురితో బీజేపీ కేంద్రమంత్రులు, నేతల దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో దొరికిన వారు సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మునుగోడు ప్రజల దృష్టి మరల్చేందుకే టీఆర్ఎస్ పన్నిన కుట్ర ఇది అని కిషన్ రెడ్డి ఆరోపించారు.డైరెక్టర్స్, ఆర్టిస్ట్ లు అంతా వాళ్లేనని విమర్శించారు.

ఫామ్ హౌస్ కు వెళ్లిన వాళ్లలో బీజేపీ వాళ్లు లేరని.. వాళ్లకు వాళ్లే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఫామ్ హౌస్ లో కుతంత్రాలు చేసుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఒక ఉప ఎన్నిక కోసం ఇంతటి చిల్లర వేషాలు వేస్తారా? అని ప్రశ్నించారు.

ప్రజలే కొత్త నాయకత్వం తెచ్చుకుంటారని తెలిపారు. 100 కోట్లుపెట్టి కొనే స్థోమత లేదన్నారు. మీకు దమ్ముంటే ఈకేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు.

ప్రధానిని తిడితే దేశ్ కీ నేత కారని.. ప్రధానిని తిట్టడానికి ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారని విమర్శలు చేశారు. నందకుమార్ తో తనకు సంబంధాలు లేవని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ సంతోష్, మంత్రి హరీష్ రావు, దాసోజు శ్రవణ్ తో నందకుమార్ ఫొటోలు ఉన్నాయని.. కల్వకుంట్ల కుటుంబానికి సంబంధాలున్నాయన్నారు. ఆ ఫొటోలను మీడియాకు కిషన్ రెడ్డి చూపించారు.

ఎవరా స్వామిజీ.. ఆయనతో మాకు మధ్యవర్తిత్వం ఏంటని ప్రశ్నించారు. చట్టం మీకేమైనా చుట్టమా? అని నిలదీశారు. ప్రజా పాలన రావాలని కిషన్ రెడ్డి తెలంగాణలో ఆకాంక్షించారు. అప్పటివరకూ ఈ కుట్రలను ఛేదిస్తామని స్పష్టం చేశారు. స్వామిజీకి ఎలాంటి శిక్షలైనా వేసుకోండి.. ఇదిపక్కా టీఆర్ఎస్ కుట్ర అని స్పష్టం చేశారు.

మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ఈకొత్త డ్రామాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కానీ మునుగోడు ప్రజలు అధర్మం వైపు నిలబడరని అన్నారు. ప్రగతిభవన్ నుంచే ఇదంతా జరిగిందని.. వందల కోట్లు ప్రగతి భవన్ కు పోయాయా? లేక ఫామ్ హౌస్ కు పోయాయా? అని కిషన్ రెడ్డి నిలదీశారు.ఫాంహౌస్ లో పట్టుబడ్డ ఎమ్మెల్యేలను ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పట్టుబడ్డ డబ్బు ఎక్కడుంది? అని ప్రశ్నించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.