Begin typing your search above and press return to search.
కరోనా అపశకునం.. పూరి జగన్నాథుడికి ముందే తెలుసా?
By: Tupaki Desk | 23 March 2020 2:30 PM GMTఏదైనా పెద్ద ఉపద్రవం వస్తే అది ఒడిషాలోని పూరి జగన్నాథుడికి తెలుస్తుందని.. ఏదో రూపంలో ఆయన భక్తులను హెచ్చరిస్తుంటాడని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. తాజాగా ఆ కోవలోనే కరోనా వైరస్ దాడికి ముందే పూరి జగన్నాథుడు భక్తులకు ఒక్క చెడ్డ శకునం ఇచ్చాడని చెబుతున్నారు.
ఇటీవలే పూరి జగన్నాథుడి ఆలయం ఎత్తైన గోపురం పైన ఉండే పవిత్ర జెండా దహనమైంది. ఒడిశా అంతటా ఈ జెండా అంటుకోవడం అపశకునం అని అందరూ భయాందోళన వ్యక్తం చేశారు. ఈ జెండా ఫొటోలు, వీడియోలు యొక్క చిత్రాలు వైరల్ అయ్యాయి. ఏదో పెద్ద అపశకునంగా భక్తులు భావించారు. ఎందుకంటే ఒడిశా వాసులు పూరి జగన్నాథుడిని ప్రధాన దేవుడిగా కొలుస్తూ వస్తున్నారు.
మార్చి 20 రాత్రి, పాపనాశిని ఏకాదశి పండుగలో భాగంగా జగన్నాథుడి ఆలయానికి చెందిన 12 వ శతాబ్దపు గోపురం పైన ఆలయ మహాదీపం ఉంచారు. కానీ గాలుల కారణంగా, నీలకాంత చక్రంతో ముడిపడి ఉన్న జెండా దిగువ భాగంలో మంటలు అంటుకొని చెలరేగాయి.. క్షణాల్లో బూడిదగా జెండా మారిపోయింది. పూరి జగన్నాథుడి ఆలయ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. చాలా మంది భక్తులు ప్రజలు దీనిని చెడ్డ శకునంగా భావించారు.
కరోనా వైరస్ తో దేశం ఇప్పటికే పెద్ద ఆరోగ్య సంక్షోభంతో పోరాడుతోంది. పూరి జగన్నాథుడి ఆలయ జెండా అంటుకోవడంతో భయాలు చాలా రెట్లు పెరిగాయి. జెండా దహనం చెడ్డ శకునంగా చూడరాదని ఆలయ అధికారులు తెలిపినా భయాలు పోవడం లేదు.
ఒడిశా రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా సోకింది. బాధిత ప్రజలను క్వారంటైన్ కు తరలిస్తూ.. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.