Begin typing your search above and press return to search.

తండ్రులను వెనక్కి నెట్టి... జగన్ మాటను పక్కన పెట్టి...

By:  Tupaki Desk   |   3 Nov 2022 11:30 PM GMT
తండ్రులను వెనక్కి నెట్టి... జగన్ మాటను పక్కన పెట్టి...
X
రాజకీయాలు అంటే పక్కన వారసులు అని రాసుకోవాలి. ఇపుడు అదే ట్రెండ్. తండ్రి అడుగు జాడలలో ఇంట్లో వారసులు చాలా మంది తయారు అవుతున్నారు. ఒకసారి వచ్చిన పదవి, తమ రెక్కల కష్టం పలుకుబడి తరాలుగా తన ఇంట్లోనే ఉండిపోవాలని నేతాశ్రీలు ఆలోచిస్తున్నారు. ఇపుడు అన్ని పార్టీలలోనూ అదే సీన్ ఉంది. వైసీపీలో కూడా అదే కనిపిస్తోంది. ఏపీలో చూస్తే వైసీపీలో వారసులు యమ జోరు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని వైసీపీలో చాలా మంది వారసులు కదన కుతూహలం ప్రదర్శిస్తున్నారు.

తండ్రులకు తామే రిటైర్మెంట్ ఇచ్చాస్తున్నారు. తమ టికెట్లను తామే తెచ్చేసుకుంటున్నారు. నిజానికి టీడీపీ అయినా వైసీపీ అయినా అధినాయకులదే ఇష్టం. వారు చెప్పిందే శాసనం. ఇంకా చెప్పాలీ అంటే టీడీపీ కంటే కూడా వైసీపీలో ఆల్ ఇన్ వన్ అన్నట్లుగా జగన్ ఉంటారని అంటారు. ఆయనకు నచ్చని పని అసలు చేయరు. ఆయన ఒక మాట అనుకుంటే దాన్ని కాదని ముందుకు సాగే సీన్ పార్టీలో ఎవరికీ లేదు. అలాంటిది ఈ మధ్యనే జగన్ ఎమ్మెల్యేల వర్క్ షాప్ సందర్భంగా వారసులకు నో టికెట్ అని పక్కాగా చెప్పారని ప్రచారంలో ఉన్న మాట.

కానీ తామే పోటీ చేస్తామంటూ వారసులు ఎక్కడా తగ్గడంలేదు. అది శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే సీమ జిల్లాల దాకా ఇదే వరస. ముఖ్యంగా సీనియర్ నాయకుల కుమరులే లైన్ లో ఉన్నారు. వారే దూకుడు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా విషయం తీసుకుంటే స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ ఆముదాలవలస టికెట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఏడు పదుల వయసు ఉన్న తండ్రికి రెస్ట్ ఇచ్చి తాను పాలిటిక్స్ చేయాలని ఆయన చూస్తున్నారు.

మరో వైపు చూస్తే ఇదే జిల్లాలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ధర్మాన క్రిష్ణదాస్ కుమారుడు క్రిష్ణ చైతన్య తానే ఎమ్మెల్యే అన్నట్లుగా ఇప్పటికే నరసన్నపేటలో హల్ చల్ చేస్తున్నారు. ఆయన జెడ్పీటీసీగా కూడా గెలిచారు. ఇపుడు ఏకంగా ఎమ్మెల్యే సీటు మీద గురి పెట్టారు. రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసారదావు కుమారుడు రాం మనోహర్ నాయుడు కూడా శ్రీకాకుళం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తండ్రి కంటే ముందే ఆయన జనంలోకి వస్తున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు కూడా ఎమ్మెల్యే సీటు కోసం క్యూలో ఉన్నారు.

విజయనగరం జిల్లాలో చూసుకుంటే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ ని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపుతారని అంటున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు తనకు టికెట్ నో చెబితే తన వారసులకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమారుడు శివ సందేశ్ కి భీమిలీ టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తూంటే ఉప ముఖ్యమత్రి బూడి ముత్యాలనాయుడు కుమారె జెడ్పీటీసీ కూడా అయిన అనూరాధ వచ్చే ఎన్నికల్లో మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చూస్తున్నారు.

అలగే ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు తన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మను 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబెట్టాలని ప్రయత్నాల్లో ఉన్నారు. గాజువాక నుంచి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుమారుడు దేవాన్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. ఇక క్రిష్ణా జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టి అపుడే జనంలో ఉంటున్నారు. ఆయన దూకుడు చేస్తున్నారు. ఆయన స్నేహితులు సన్నిహితులు సైతం కాబోయే ఎమ్మెల్యే అంటూ హోర్డింగులు పెట్టే విధంగా కిట్టూ హడావుడు ఉందని చెప్పాలి.

ఇదే తీరున తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డిని కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి దించుతారని అని అంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తన కుమార్తెని ఎమ్మెల్యేగా పోటీకి పెడతారు అని చెబుతున్నారు. ఇదే వరసలో మంత్రి బుగ్గర రాజేంద్రనాధ్ రెడ్డి సహా చాలా మంది సీనియర్ నాయకులు వారసులను రంగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇక్కడ ఒక మాట ఉంది. వీరిది ఉత్సాహమే కానీ ప్రోత్సాహం జగన్ ఇవ్వాలి. ఆయన అయితే 2024 ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకున్నారు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఏ ఒక్క సీటునూ లైట్ గా తీసుకోవడానికి లేదని జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. హోరాహోరీగా సాగే పోరులో సీనియర్లు బరిలో ఉంటేనే బాగుంటుంది అన్నది జగన్ మార్క్ వ్యూహమని అంటున్నారు.

అయినా సరే సీనియర్ నేతలు తమ వారసులను దించాలనుకుంటున్నారు. తనయులు సైతం తండ్రులను నెట్టేసి ముందుకు వస్తున్నారు. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. నో అంటే మాత్రం యువ రక్తం మీద నీళ్ళు చల్లేసినట్లే. మరి ఇప్పటికే రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతున్న సీనియర్లను చివరి నిముషంలో పోటీకి దించితే సక్సెస్ ఫుల్ గా ఫలితాలు వస్తాయా. ఏమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.