Begin typing your search above and press return to search.

ఆ మంత్రుల‌ను ముందుకు నెట్టి.. వైసీపీ వ్యూహం

By:  Tupaki Desk   |   22 Oct 2022 12:30 PM GMT
ఆ మంత్రుల‌ను ముందుకు నెట్టి..  వైసీపీ వ్యూహం
X
అమరావతి రైతులు చేస్తున్న మ‌హా పాదయాత్ర 2.0కు పోటీగా శ్రీకాకుళం, విజయనగరం నుంచి మంత్రుల నేతృత్వంలో పాదయాత్రలు చేపట్టే ప్రతిపాదన తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త రెండు మూడు రోజులుగా వైసీపీ అధినాయకత్వం ఈ విష‌యాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. అమరావతి యాత్ర ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఎలా ప్రతిస్పందించాలి, ఎలా ఎదురుదాడి చేయాలి అనే అంశాలపై..

సీనియర్‌ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, అనకాపల్లి జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌, కాకినాడ జిల్లాకు చెందిన మంత్రి దాడిశెట్టి రాజా తదితరులు ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో సమావేశమై చర్చించుకున్నట్లు తెలిసింది.

ఈ చర్చల్లో వచ్చిన పలు ప్రతిపాదనలను అమలు చేయబోతున్నారని సమాచారం. 'విశాఖను రాజధాని చేయకుండా అడ్డుకునేందుకే అమరావతి యాత్ర' అన్న తమ వాదనను ఉత్తరాంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా.. రాజకీయేతర జేఏసీ ఏర్పాటు చేసి, రౌండ్‌టేబుల్‌ సమావేశాలను ఇప్ప‌టికే నిర్వహిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచే అమరావతి పాదయాత్రకు పోటీగా యాత్రలు, సభలు నిర్వహిస్తూ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిని మరింత తీవ్రతరం చేసే కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నట్లు వై సీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు మంత్రులు కూడా మాటల దాడిని పెంచారు.

ఇప్పుడు మంత్రులను ముందుకు పెట్టి.. అమ‌రావ‌తిపై క‌ద‌న తంత్రాన్ని మ‌రింత పెంచాల‌నేది వైసీపీ వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని రైతుల‌కు అన్ని వ‌ర్గాల‌కు ప్రాంతాల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇప్ప‌టికే.. తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది.

ఈ క్ర‌మంలో విశాఖ‌లోనూ ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తే.. అది మొద‌టికే మోసం చేస్తుంద‌ని భావిస్తున్న వైసీపీఅధిష్టానం.. ఇప్పుడు మంత్రుల‌ను ముందు పెట్టిన క‌ద‌నానికి ప్లాన్ చేసింద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి మంత్రులే రంగంలోకి దిగితే.. త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.