Begin typing your search above and press return to search.

పుష్ప.. అర్చనలా కాదు.. ఇష్టం లేని పెళ్లి చేశారని తానే చనిపోయింది

By:  Tupaki Desk   |   27 April 2022 5:45 AM GMT
పుష్ప.. అర్చనలా కాదు.. ఇష్టం లేని పెళ్లి చేశారని తానే చనిపోయింది
X
కాలం మారింది. ఆలోచనలు మారుతున్నాయి. గతానికి భిన్నంగా అమ్మాయి.. అబ్బాయి అన్న తేడా లేకుండా అందరూ పని చేస్తున్నారు. ఆర్థికంగా స్వతంత్ర్యంగా ఉంటున్నారు. ఇలాంటి వేళ.. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పెద్దవారి తీరుతో కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలో రెండు సంచలన ఉదంతాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో విషాద ఉదంతం చోటు చేసుకుంది. ఈ మూడింటికి కారణం మాత్రం 'ఇష్టం లేని పెళ్లినే' కావటం గమనార్హం.

సంచలనంగా మారిన పుష్ప ఎపిసోడ్ లోకి వెళితే.. పెళ్లి వద్దు.. అధ్యాత్మికం ముద్దు అంటే నో చెప్పి.. బలవంతంగా పెళ్లికి ఒప్పించటం.. ఎంగేజ్ మెంట్ అయ్యాక కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు చున్నీతో గంతలు కట్టి గొంతు కోసేయటం తెలిసిందే. ఇక.. అర్చన విషయానికి వస్తే.. ఇష్టం లేని పెళ్లి చేసిన భర్తతో కలిసి బతకలేక.. పెళ్లైన నెల వ్యవధిలోనే గాఢ నిద్రలో ఉన్న వేళ.. బ్లేడ్ తో అతడి గొంతును కోసేసిన వైనం అందరిని ఉలిక్కిపడేలా చేసింది.

ఈ రెండు ఉదంతాలకు భిన్నంగా ఇష్టం లేని పెళ్లి చేసినందకు మిగిలిన వారి మాదిరి కాకుండా తనను తాను శిక్షించుకుంది ఈ జితేంద్రిత. కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన తులసికి ఇద్దరు కుమార్తెలు.

భర్త మరణించినప్పటికీ ఇద్దరి కూతుళ్లను పెంచి పెద్ద చేసింది. ప్రయోజికుల్ని చేసింది. పెద్దమ్మాయి జితేంద్రితకు పెళ్లంటే మొదట్నించి ఇష్టం లేదు. దీంతో మొదట చిన్న కుమార్తెకు పెళ్లి చేశారు.

ఈ మధ్యనే పెద్దమ్మాయిని ఒప్పించి వరంగల్ జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగి సంతోశ్ తో పెళ్లి చేశారు. మార్చి 27న వారి పెళ్లి జరిగింది. ఈ మధ్యనే వారు కేపీహెచ్ బీకాలనీలోని ఒక ఇంట్లో కాపురం పెట్టారు. సోమవారం భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత.. ఇంటి నుంచే పని చేస్తున్న జితేంద్రిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన సంతోశ్.. ఇంటి తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చింది. తలుపు పగలకొట్టి చూస్తే.. జితేంద్రిత ఉరి వేసుకొని ఉండటం కనిపించి షాక్ తిన్నాడు. ఇష్టం లేని పెళ్లితోనే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు.