Begin typing your search above and press return to search.
తగ్గేదేలే : పుష్ప మేడం ఇలాకాలో ఇదే సీన్ ..?
By: Tupaki Desk | 22 May 2022 2:30 AM GMTఆమె నిన్నటి దాకా ఉప ముఖ్యమంత్రి. మూడు పదుల వయసులోనే అంతటి బరువు బాధ్యతలను ఆమెకు అప్పగించారు జగన్. అయితే మూడేళ్ళ మంత్రిత్వంలో ఆమె జనాలకు పెద్దగా చేరువ కాలేకపోయారు అని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. కానీ ఎక్కడికక్కడ సొంత పార్టీ నేతలే ఆమెకు అనేక అడ్డంకులు సృష్టించారు అన్నది ఆమె అనుచరుల ప్రతి విమర్శ.
మొత్తానికి ఆమె అధికార జమానా ముగిసింది. ఇపుడు పార్వతీపురం మన్యం జిల్లాకు ఆమె వైసీపీ ప్రెసిడెంట్ గా నియమితులయ్యరు. రాష్ట్రలో అతి తక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్న జిల్లాగా దీనికి గుర్తింపు ఉంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అన్నీ కూడా ఇపుడు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి.
అయితే చిత్రమేంటి అంటే ఈ నాలుగూ నాలుగు దిక్కులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కురుపాంకి పార్వతీపురానికి పెద్ద దూరం లేదు. పక్కపక్కనే ఉంటాయి. కానీ పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు పుష్ప శ్రీవాణికీ ఎందుకో పడదు అంటారు. ఆయన ఆమె డిప్యూటీ సీఎం గా ఉండగానే సొంతంగానే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లేవారు. ఎక్కడా ఆమెను పిలిచి పెద్ద పీట వేసిన దాఖలాలు లేవు
ఇక సాలూరు విషయానికి వస్తే సేమ్ డిటో సీన్. ఇక్కడ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే రాజన్న దొర ఉన్నారు. తనకు కాకుండా పిన్న వయస్కురాలు, జూనియర్ అయిన పుష్పకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వడం మీద రాజన్న నాడు అలిగారు అంటారు. అందుకే ఆయన కూడా సహాయ నిరాకరణ చేస్తూ వెళ్లారు.
ఇక పాలకొండలో ఉన్న విశ్వాసరాయి కళావతి కూడా తన దారి తనదే అన్నట్లుగా ఉంటున్నారు. దాంతో కొత్త ప్రెసిడెంట్ పుష్ప శ్రీవాణికి ఎవరూ సహకరించేది లేదు అని తేలిపోతున్న వైనం. అయినా సరే తగ్గేది లే అంటున్నరు పుష్ప. ఆమె అచ్చం పుష్ప సినిమాలో డైలాగ్ మాదిరిగా తానే రాజు తానే మంత్రి తరహాలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
జిల్లాకు మంత్రిగా ఉన్న పెద్ద దిక్కుగా ఉన్న రాజన్న దొర పేరు ఎక్కడా లేకుండా ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా గతంలో రాజన్న దొర చేసిన దానికి కౌంటర్ అటాక్ పాలిటిక్స్ అంటున్నారు. అలాగే మిగిలిన ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని ముందుకు పోవడం లేదు. మరి జిల్లాలో నాలుగు సీట్లు ఉంటే నాలుగింటినీ గెలిపించాల్సిన మేడం ఇలా తానే అంతా అన్నట్లుగా వ్యవహరించడం పట్ల సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.
కొందరు అయితే ఈ విషయాలను రీజనల్ కో ఆర్డినేటర్ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారుట కూడా. మరి ఆయన వచ్చి మన్యం జిల్లా రాజకీయాలను చక్కబెట్టకపోతే ఎవరికి వారు తగ్గేదే లే అంటున్నారు. మరి ఈ చిత్ర విచిత్ర పాలిటిక్స్ తో టీడీపీకి కచ్చితంగా అక్కడ పెరిగి తీరుతుంది అని కూడా అంటున్నారు.