Begin typing your search above and press return to search.

పెళ్లి తర్వాత జీన్స్ వేసుకోవటమా? ప్రశ్నించిన భర్తను చంపేసిన పుష్ప

By:  Tupaki Desk   |   18 July 2022 11:30 PM GMT
పెళ్లి తర్వాత జీన్స్ వేసుకోవటమా? ప్రశ్నించిన భర్తను చంపేసిన పుష్ప
X
మారిన కాలానికి తగ్గట్లు వస్త్రధారణ విషయంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి అంశాల్లో ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవటం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందుకు భిన్నంగా గొడవ పడి.. విషయం కోట్లాట వరకు వెళితే.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి జార్ఖండ్ లో చోటు చేసుకుంది.

పెళ్లైన తర్వాత జీన్స్ ధరించిన భార్యను భర్త ప్రశ్నించటం.. వారిద్దరి మధ్య మాటా మాటా పెరగటం.. చివరకు అదో గొడవగా మారి.. ఆవేశంతో భర్తను భార్య కత్తితో పొడిచేసిన దారుణ ఉదంతం చోటు చేసుకుంది.

ఈ ఉదంతంలో బర్త ప్రాణాలు కోల్పోయిన వైనం షాకింగ్ గా మారింది. జార్ఖండ్ లోని జామ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలో జోర్బితా గ్రామంలో పుష్పా హెంబ్రోమ్ కు పెళ్లైంది. శనివారం రాత్రి ఊరికి దగ్గర్లోని గోపాల్ పూర్ గ్రామంలో జాతర జరిగింది.

దీనికి వెళ్లే సమయంలో జీన్స్ ఫ్యాంటు ధరించిన పుష్ప.. జాతర చూసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. భార్య జీన్స్ వేసుకొని వెళ్లటంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు భార్య. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పెరిగి పెద్దది కావటం..

తీవ్రమైన ఆవేశానికి గురైన పుష్ప.. చేతికి అందిన కత్తితో భర్తను పొడిచేసింది.దీంతో తీవ్ర గాయాలైన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలోనే భర్త మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ పరిణామం షాకింగ్ గా మారింది. కొడుకు.. కోడలి మధ్య జీన్స్ వేసుకోవటంపై జరిగిన గొడవ పెద్దది కావటం.. ఆవేశానికి లోనైన కోడలు కత్తితో తన కొడుకును పొడిచినట్లుగా మ్రతుడి తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు పుష్పను అదుపులోకి తీసుకున్నారు.