Begin typing your search above and press return to search.

పొలానికి మందు స్ప్రే చేస్తూ రైతుగా మారిన ఎమ్మెల్యే ..ఎవరంటే

By:  Tupaki Desk   |   22 Oct 2020 12:30 AM GMT
పొలానికి  మందు స్ప్రే చేస్తూ రైతుగా మారిన ఎమ్మెల్యే ..ఎవరంటే
X
కరోనా మహమ్మారి జోరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఎదో ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటాం అని కొందరు దైర్యం చేసి ఇంటి నుండి బయటకి వచ్చి పనులు చూసుకుని వెళ్తున్నారే తప్ప ,అందరిలో కరోనా మహమ్మారి భయం ఇంకా పోలేదు. దీనికి కారణం ఇంకా ఆ మహమ్మారిని అరికట్టే సరైన వ్యాక్సిన్ లేకపోవడమే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ కష్టాలు తప్పేలా లేవు. దీనితో చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు. నగరాలు, పట్టణాల్లో పరిస్థితి బాగా లేకపోవడంతో చాలావరకు ఖాళీ చేసి అందరూ ఊళ్లకు వెళ్లిపోయారు. ఇక ప్రజా ప్రతినిధులు కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే సరదాగా పొలం వైపు వెళుతున్నారు.. తమ పనుల్ని స్వయంగా పరిశీలిస్తూ సరి చేసుకుంటున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అదే పనిలో నిమగ్నమైయ్యారు. నిత్యం ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా కనిపించే పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు పొలం బాట పట్టారు. చిత్తూరు మండలం వెంకటాపురం లో తన పొలంలో వరి పంటను సాగు చేస్తున్నారు. తాను సాగు చేస్తున్న వరి పంటను మంగళవారం ఆయన పరిశీలించారు. పంటకు తెల్ల చీడలు సోకినట్లు గుర్తించిన ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు ఆయన స్వయంగా గంటపాటు పురుగుల మందు స్ప్రే చేశారు. మరికొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా ఇలా రోజులో కొద్ది సమయాన్ని పొలం పనులకు కేటాయిస్తున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యే అయినప్పటికీ ఏ మాత్రం సంకోచం లేకుండా రైతు పనిని చేసుకుంటూ కాసేపు హాయిగా సేదదీరుతున్నాడు.