Begin typing your search above and press return to search.

వార్ మొదలయ్యాక పుతిన్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   25 Feb 2022 3:21 AM GMT
వార్ మొదలయ్యాక పుతిన్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు?
X
ఉక్రెయిన్ మీద సైనిక చర్య తీసుకోవటానికి డిసైడ్ అయిన రష్యా అధ్యక్షుడు.. అందుకు తగ్గట్లే వార్ ను షురూ చేయటం.. ఇప్పటికే ఉక్రెయిన్ కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పలువురు వెలువరిస్తున్న వివరాల ప్రకారం.. రష్యా సైన్యం కారణంగా దాదాపు 300లకు పైగా ఉక్రెయిన్లు ప్రాణాలు విడిచినట్లుగా చెబుతున్నారు. రోడ్ల మీద వాహనాల మీద వెళుతున్న వారు.. వైమానిక దాడి కారణంగా రోడ్ల మీదనే దారుణంగా చనిపోయి పడి ఉన్న ఉదంతాలు కనిపిస్తున్నాయి.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయాన్ని తెలిపేలా చేస్తున్నాయి.

బాంబు దాడుల కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది. పుతిన్ తీసుకున్న సైనిక చర్య మీద ప్రపంచంలోని పలు దేశాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. అగ్ర రాజ్యమైన అమెరికా పుతిన్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఉక్రెయిన్ కు అండగా నిలుస్తామన్న నాటో దేశాలు సైతం పుతిన చర్యను తప్పు పడుతున్నాయి.

గురువారం రాత్రి వేళలో పుతిన్ కు ఫోన్ చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం.. ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని నిలిపివేయాలని.. భారతీయులు పలువురు ఉక్రెయిన్ లో ఉంటారని.. వారికి ఎలాంటి హాని కలగకుండా చూడాలని పుతిన్ ను కోరినట్లుగా చెబుతున్నారు.

ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడిన పుతిన్.. కాసేపటి తర్వాత మీడియా సంస్థలతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్ ఇదేనని చెప్పాలి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి రష్యా రాజధాని మాస్కోలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాల్ని ప్రస్తావించారు. తన వాదనను బలంగా వినిపించారు.

గ్లోబల్ ఎకానమీలో తాము కూడా భాగమేనని.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు పాడు చేయటానికి తాము ఎలాంటి ప్లాన్లు వేయలేదన్నారు. అలాంటి లక్ష్యమేమీ తమకు లేదన్నారు. తాము తమ దేశాన్ని (రష్యాను) రక్షించుకోవటానికే తామీ సైనిక చర్యను చేపట్టినట్లుగా పేర్కొన్నారు.

‘కేవలం రష్యాను రక్షించుకోవటానికే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాం. మా భాగస్వామి దేశాలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. యుద్దం కొనసాగించే విషయంలో విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదంటూ.. ఎవడి మాట వినడు సీతయ్య అన్న రేంజ్లో తేల్చేశారు.