Begin typing your search above and press return to search.
మదర్ హీరోయిన్ అవార్డు.. చాలా స్పెషల్ అంటున్న రష్యా..!
By: Tupaki Desk | 16 Nov 2022 12:30 AM GMTరష్యా గుఢాచారిగా కెరీర్ ను ప్రారంభించిన పుతిన్ అనతికాలంలోనే ఆ దేశ అధ్యక్షుడిగా మారారు. రష్యాలో ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశంలోనే బలమైన నేతగా ఎదిగారు. అధ్యక్ష పీఠం నుంచి ఆయన్ని ఎవరూ కదిలించలేని స్థితికి చేరుకున్నారు. అయితే యుద్ధకాంక్ష కలిగిన పుతిన్ సోవియట్ యూనియన్ ను తిరిగి ఒక్కటే చేయాలనే లక్ష్యంతోనే కొన్నేళ్లుగా ముందుకు సాగుతున్నారు.
అణ్వాయుధాలు.. ఆయుధ సంపత్తిలో అమెరికాకు ఏమాత్రం తీసిపోని రీతిలో రష్యన్ ఆర్మీ ఉంది. ఒకప్పుడు రష్యాలో భాగమైన ఉక్రెయిన్ ఆ తర్వాత విడిపోయి స్వాతంత్ర దేశంగా ఏర్పడింది. అయితే ఉక్రెయిన్ ఇటీవలీ కాలంలో యూరోపియన్ యూనియాన్ లో కలిసేందుకు ప్రయత్నిస్తూ నాటో దేశాలకు ఆశ్రయం ఇచ్చేందుకు యత్నించడంపై పుతిన్ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఇరుదేశాల మధ్య కొంతకాలంగా తీవ్రమైన యుద్ధం నడుస్తోంది. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడాన్ని రష్యన్లు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్ లో రష్యన్ పూర్వీకులు.. బంధువులు ఉండటంతో వారంతా కూడా యుద్ధాన్ని త్వరితంగా పూర్తి చేయాలని పుతిన్ ను వేడుకుంటున్నారు. అయితే యుద్ధం ఎటూ తేలకుండా మధ్యలో ఆపే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా రష్యాలో పుతిన్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే దీనిని తగ్గించుకునేందుకు ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోవియట్ కాలం నాటి మదర్ హీరోయిన్ అవార్డును పుతిన్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ అవార్డు దక్కించుకునే ప్రతి తల్లికి రష్యన్ ప్రభుత్వం 13 లక్షల నగదును అందజేయనుండటం విశేషం.
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే మదర్ హీరోయిన్ అవార్డును తీసుకోస్తున్నట్లు రష్యా అధికారిక డిక్రీ పేర్కొంది. రష్యా ఫెడరేషన్ పౌరులై ఉండి పది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి పెంచిన తల్లులను 'మదర్ హీరోయిన్' అవార్డుతో సత్కరించనున్నారు. ఈ అవార్డును రష్యా 1990-94 మధ్య కాలంలో అందించింది.
ఆ తర్వాత ఈ అవార్డు ప్రకటన నిలిచిపోయింది. అయితే ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ తిరిగి ఈ అవార్డును పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే మదర్ హీరోయిన్ అవార్డుకు పుతిన్ స్నేహితుడు రమ్ జాన్ కదిరోవ్ భార్య మెద్నీ.. ఆర్కిటిక్ యమలో నెనెట్స్ ప్రాంతానికి చెందిన మరో మహిళ ఎంపికయ్యారు. వీరికి రష్యా ప్రభుత్వం సుమారు 13 లక్షల చొప్పున నగదును అందజేసి సత్కరించనుంది.
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో పుతిన్ ఈ అవార్డును తీసుకురావడంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా మదర్ హీరోయిన్ అవార్డును పుతిన్ తెరపైకి తీసుకురావడంతో రష్యాలో సంప్రాదాయ ధోరణి తీవ్రతరం అవుతుందని అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.