Begin typing your search above and press return to search.

పుతిన్ ఆస్తి లక్షల కోట్లు.. ఆ నిధి కోసం వెతుకులాట!

By:  Tupaki Desk   |   17 March 2022 12:31 PM GMT
పుతిన్ ఆస్తి లక్షల కోట్లు.. ఆ నిధి కోసం వెతుకులాట!
X
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రంగా మారుతుంది. రోజుకు వందల మంది చనిపోతున్నారు. ఇటు ఉక్రెయిన్ సైనికులు కానీ, అటు రష్యా సైనికులు కానీ యుద్ధంలో సమిధలుగా మారుతున్నారు. ఇదిలా ఇలా ఉంటే రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దాడుల్లో ఏ మాత్రం తేడా లేదు. ఏ వైపు నుంచి ఎవరు బాంబులు వేస్తారో అని నిరంతరం భయపడుతున్నారు. దీనికి తోడు రష్యా యుద్ధ రంగంలో మాత్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తుండడం ఉక్రెయిన్ ను మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇంకో వైపు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సేనలను గట్టిగానే ఎదుర్కొంటుంది. రష్యా దాడికి సరైన జవాబు చెప్తున్నట్లుగా అదే స్థాయిలో ధీటుగా పుతిన్ సేనలపై విరుచుకుపడుతుంది. వార్ ప్రారంభం అయిన రోజు కేవలం కొద్ది రోజుల్లోనే ఈ యుద్ధం ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా వ్యవహరించి ముందుకు సాగుతుంది ఉక్రెయిన్.

ఇలా ఉక్రెయిన్ ముందుకు సాగుతుంది అంటే కేవలం అది ఉక్రెయిన్ పోరాట పటిమ మాత్రమే కాదు. నాటో దేశాలు అందిస్తున్న సహకారం అని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో ఆయుధాలను చేతపట్టింది ఉక్రెయిన్ సైన్యం. దీంతోనే తమ దేశాన్ని కాపాడు కోగలుగుతుంది.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు మొదటి నుంచి అమెరికా పరోక్షంగా సహకారం అందిస్తుంది. సైబర్ రంగంలో కూడా సహకారాన్ని కొనసాగిస్తుంది. అయితే రష్యాకు ఉన్న అతి పెద్ద అసెట్ వ్యాపారం. దీని ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది. దీన్ని పసిగట్టిన అమెరికా, నాటో దేశాలు ఆ దేశం పై ఆంక్షలను విధించాయి.

అలాగే ప్రముఖ వ్యాపార వెత్తలు, పుతిన్ కు సన్నిహితంగా ఉండే వారు ఇలా చాలా మంది పై ఆంక్షలు విధించాయి నాటో దేశాలు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పై విస్తున్న కథనాలు యావత్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా ఉండే వారిలో పుతిన్ మొదటి స్థానంలో ఉన్నారనే వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. సుమారు పుతిని దగ్గర 200 బిలియన్ డాలర్ల సొమ్ము ఉన్నట్లు ఈ కథనాల సారాంశం.

అయితే పుతిన్ కు ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఈ కథనాలు చూసిన వారి ప్రశ్న. దీనికి కూడా వారి దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎలా అంటే... రష్యా అధికారిక కరెన్సీ అయిన రూబుల్ నుంచి సగానికి పైగా సొమ్ముని పుతిన్ ఎవరికి తెలియకుండా దాచి ఉంచినట్లు కొన్ని సంస్థలు పేర్కొన్నాయి.

తనకు అత్యంత సన్నిహితులు అయిన వారి సహాయంతో కోట్ల రూపాయిల సంపదను ఎవరికి తెలియకుండా దాచి ఉంచినట్లు ఆరోపిస్తున్నాయి. అయితే పుతిన్ దాచి పెట్టిన ఈ కోట్ల రూపాయల నిధి కోసం నాటో దేశాలు వేట కొనసాగిస్తున్నట్లు పేర్కొంటున్నాయి . ప్రపంచంలోనే అతి పెద్దది అయిన నిధిని కనుగొంటే.. రష్యాను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీయవచ్చు అని భావిస్తున్నారు.

పుతిన్ సంపద పలువురి పేర్ల మీద ఉన్నట్లు భావిస్తున్నారు. సర్రేలోని పుతిన్ కుమార్తెల దగ్గర పెద్ద మొత్తంలో సంపద ఉన్నట్లు పలు సంస్థలు చెప్తున్నాయి. దీనిలో భాగంగా.. సుమారు 60 ఎయిర్ క్రాప్టులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంపదలోనే భాగంగా... ఎన్నో లగ్జరీ భవనాలు ఉన్నాయి.

అందులోనే విలాసవంతమైన కార్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే పుతిన్ కూడా తెలివిగా ఈ సొమ్మును తన సన్నిహితులతో పాటు స్నేహితులు, తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి దగ్గర ఉన్నట్లు బ్రిటన్ కు చెందిన కొన్ని సంస్థలు చెప్తున్నాయి. ఈ సంపద కోసం చాలా మంది వెతుకులాట ప్రారంభించారని కూడా పేర్కొన్నాయి.