Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ పై వ్యూహం మార్చిన పుతిన్

By:  Tupaki Desk   |   7 Jun 2022 3:49 AM GMT
ఉక్రెయిన్ పై వ్యూహం మార్చిన పుతిన్
X
ఉక్రెయిన్ పై గడచిన 100 రోజులకు పైగా యుద్ధం చేస్తున్న రష్యా అధినేత పుతిన్ వ్యూహాన్ని మార్చుకున్నారా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఉక్రెయిన్ భూభాగంలో రష్యా జెండాలను పాతేస్తోంది. తన ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాన్ని శాశ్వతంగా సొంతం చేసుకునే ఆలోచనలు రష్యా ఉన్నట్లు అర్థమైపోతోంది.

ఖెర్సన్, హ్రివ్నియాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రష్యా ఇప్పటికే జెండాలను పాతేసింది. అలాగే ఆ ప్రాంతాల్లోని జనాలు ఉక్రెయిన్లో ఉండాలా ? లేకపోతే రష్యాలో కలవాలని అనుకుంటున్నారా ? అనే విషయమై అభిప్రాయ సేకరణ కూడా మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో అధికారిక కరెన్సీగా తన కరెన్సీ రూబుల్ ను రష్యా ప్రవేశపెట్టింది. ఇదంతా సరిపోదన్నట్లుగా పౌరసత్వం తీసుకోవాలని అనుకుంటున్న జనాలకు వెసులుబాటు కూడా కల్పించేసింది.

నిజానికి ఇపుడు రష్యా చేస్తున్నట్లు గతంలో ఏ దేశమూ చేయలేదు. ఎందుకంటే యుద్ధం పూర్తి కాకపోవడంతో ఉక్రెయిన్ను నూరుశాతం రష్యా హస్తగతం చేసుకోలేదు. ఇప్పటివరకు ఉక్రెయిన్లోని 20 శాతం భూభాగం మాత్రమే రష్యా ఆధీనంలో ఉంది.

ఈ మాత్రం భూభాగంలో రష్యా పరిపాలన చేయాలని అనుకుంటోంది. ఇది ఎలా సాధ్యమో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఒకే దేశంలో కొంత భూభాగం రష్యా ఆధీనంలోను, మిగిలిన ప్రాంతమంతా ఉక్రెయిన్ పాలనలో ఉంటే ఇబ్బందిపడేది జనాలే.

ఈ విషయం పుతిన్ తెలియక కాదు. అయినా ఉక్రెయిన్ భూభాగంలో రష్యా పరిపాలన మొదలుపెట్టబోతోందంటే ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని చికాకులు పెట్టడమే ప్రధాన టార్గెట్ గా అర్ధమైపోతోంది. ఇదే సమయంలో జనాలపైన కూడా మానసికంగా పైచేయి సాధించటమే పుతిన్ కు కావాల్సింది.

ఎలాగు ఒకపుడు ఉక్రెయిన్ పూర్వపు యూఎస్ఎస్ఆర్ లో భాగమే కాబట్టి ఇప్పటి రష్యా ఆధిపత్యంలోకి వెళ్ళిపోవటానికి జనాలు కూడా పెద్దగా అభ్యంతరం పెట్టరని పుతిన్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే రష్యా జెండాలు పాతడం, రూబుల్ కరెన్సీని చెలామణిలోకి తీసుకురావటం, సిటిజన్ షిప్ నమోదు జరుగుతోంది.