Begin typing your search above and press return to search.

ఆటం బాంబ్‌ ప్రయోగంపై పుతిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   7 Nov 2022 5:12 AM GMT
ఆటం బాంబ్‌ ప్రయోగంపై పుతిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
X
ఆటం బాంబ్‌ ప్రయోగంపై రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో పుతిన్‌ మాట్లాడినట్టు యూకే పత్రిక డెయిలీ మెయిల్‌ సంచలన కథనం ప్రచురించింది.

ఫ్రాన్స్‌ అధినేత మాక్రాన్‌తో పుతిన్‌ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హీరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులను ప్రయోగించిన సంగతిని గుర్తు చేశారు. అన్యాపదేశంగా తాము ఉక్రెయిన్‌పై కూడా అణు బాంబును ప్రయోగించే ఉద్దేశం ఉందని చెప్పడానికే జపాన్‌ ఘటనను పుతిన్‌ ఎత్తారని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధినేత ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి అణుదాడుల గురించి మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగించిందని యూకే మీడియా పేర్కొంది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పుతిన్‌ దండయాత్రకు దిగారు. మొదట్లో ఒక్కో నగరాన్ని జయించుకుంటూ వెళ్లిన రష్యాకు ఆ తర్వాత ఇబ్బందులు మొదలయ్యాయి. అమెరికా, బ్రిటన్‌ నుంచి ఆయుధాలు అందడంతో ఉక్రెయిన్‌ గట్టిగానే పోరాడుతోంది. అంతేకాకుండా రష్యా తమ నుంచి స్వాధీనం చేసుకుంటూ వస్తున్న వాటిని తిరిగి దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో పుతిన్‌ అవసరమైతే ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణు దాడులు చేస్తానంటూ బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో పుతిన్‌ సంభాషిస్తూ...1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణు బాంబులు ప్రయోగించిందని గుర్తు చేశారు. దీంతో జపాన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో లొంగిపోయిందన్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా గెలవాలంటే ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదన్నారు. అంటే నగరాలపైన కాకుండా ఎక్కడైనా తాము అణు దాడికి సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ సంకేతం ఇచ్చారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను వదిలిపెట్టి ఈస్ట్‌ ఉక్రెయిన్‌లో అణు దాడి చేయొచ్చనే సంకేతం ఇచ్చారని డెయిలీ మెయిల్‌ తన కథనంలో పేర్కొంది.

మరోవైపు ఉక్రెయినే తమ ఆధీనంలో ఖేర్సన్‌ ప్రాంతంపై డర్టీ బాంబు ప్రయోగించబోతోందని రష్యా ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.