Begin typing your search above and press return to search.

పుతిన్ పరిస్థితి సీరియస్.. అత్యవసర చికిత్స.. అసలేమైంది? పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   27 July 2022 12:20 PM GMT
పుతిన్ పరిస్థితి సీరియస్.. అత్యవసర చికిత్స.. అసలేమైంది? పరిస్థితేంటి?
X
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని రష్యా టెలిగ్రామ్ ఛానెల్ పేర్కొంది. దీంతో హుటాహుటిన రెండు వైద్య బృందాలు ఆయన నివాసానికి తరలివెళ్లాయి. పుతిన్ కు ఏమైంది? ఎందుకు పరిస్థితి విషమించిందని అందరూ ఆరాతీవారు. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పుతిన్ కు అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో తీవ్ర వికారంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సుమారు మూడు గంటల పాటు మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం పుతిన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది.

జులై 22 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర వికారంగా ఉన్నట్లు పుతిన్ తన సహాయకులకు చెప్పారు. విధుల్లో ఉన్న పారామెడికల్ సిబ్బంది ఓ 20 నిమిషాల పాటు పుతిన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు.

తర్వాత పరిస్థితి కుదటపడకపోవడంతో వెంటనే ప్రత్యేక వైద్య బృందానికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పుతిన్ ఛాంబర్ కు చేరుకున్న వైద్యబృందం మూడు గంటల పాటు చికిత్స అందించింది. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో తెల్లవారుజామున పుతిన్ ఛాంబర్ నుంచి వైద్యులు బయటకు వెళ్లిపోయారని రష్యా వార్తా సంస్థ వెల్లడించింది.

ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై కథనాలు వస్తున్నాయి. ఆయన క్యాన్సర్ లేదా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇక పలు సమావేశాల్లోనూ పుతిన్ కాళ్లు, చేతులు వణుకుతున్నట్లు కనిపించాయి.

అయితే పుతిన్ ఆరోగ్యం బాగానే ఉందని అధ్యక్ష భవనం తోసిపుచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని తెలిపింది. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఈ వార్తలకు బలం చేకూర్చినట్టైంది.