Begin typing your search above and press return to search.

పుతిన్ కూతురు ప్రియుడి కోసం 50 సార్లు వెళ్లిందట.. వైరల్

By:  Tupaki Desk   |   23 May 2022 2:30 AM GMT
పుతిన్ కూతురు ప్రియుడి కోసం 50 సార్లు వెళ్లిందట.. వైరల్
X
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి ప్రపంచానికి కఠిన వాస్తవాలు బయటపడుతున్నాయి. పాశ్చాత్య మీడియా ఆయన గుట్టు మట్లు అన్నీ తవ్వి వెలికితీస్తున్నాయి. పుతిన్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రపంచం చాలా ఆసక్తి కనబర్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే పుతిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇప్పటివరకూ పుతిన్ సీక్రెట్ లవ్ ఎఫైర్ గురించి చర్చించుకున్న ప్రపంచానికి ఇప్పుడు పుతిన్ కుమార్తె ప్రేమ కథ ఇప్పుడు వైరల్ గా మారింది. మాజీ డ్యాన్సర్ అయిన పుతిన్ కుమార్తె కేథరినా టిఖోనోవా.. జర్మనీలోని మ్యూనిచ్ లో ఉంటున్న ఇగోర్ జెలెన్స్కీ అనే బ్యాలెట్ డ్యాన్సర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రియుడు ఇగోర్ జెలెన్స్కీని కలిసేందుకు కేథరినా.. 2018-19 మధ్య 50 సార్లు జర్మనీలోని మ్యూనిచ్ సిటీకి ప్రయాణించారనే విషయం మీడియా సంస్థల పరిశోధనలో తేలింది. మాస్కో మరియు మ్యూనిచ్ మధ్య వరుస విమాన ప్రయాణాలకు సంబంధించిన పత్రాలను బయటపెట్టారు.

టిఖోనోవా ప్రతిసారి ప్రభుత్వ చార్టర్డ్ విమానాల్లో జర్మనీలోని మ్యూనిచ్ కు వెళ్లినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడూ రహస్యంగా ఉంచబడిన పుతిన్, అతడి కుటుంబం యొక్క వ్యక్తిగత జీవితాలు బహిర్గతమయ్యాయి. గతంలో పుతిన్ ఒలింపిక్ పతక విజేత జిమ్నాస్ట్ అలీనా కబెవాతో ఉన్న రహస్య ప్రేమ కథను వెల్లడించారు. ఇప్పుడు ఆమె కుమార్తె జర్మన్ డ్యాన్సర్ తో సంబంధం కలిగి ఉంది.

ఇంగోర్ జెలెన్స్కీ 52 ఏళ్ల డ్యాన్సర్ ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు బేరిషెస్ స్టాట్స్ బాల్ డైరెక్టర్ గా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల జెలిన్స్కీ ఏప్రిల్ 4న ఆ పదవికి రాజీనామా చేశారు. టిఖోనోవా మరియు జెలెన్స్కీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియదు.