Begin typing your search above and press return to search.
పుతిన్ కు మెదడు సంబంధిత సమస్య
By: Tupaki Desk | 14 March 2022 7:55 AM GMTరష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై బ్రిటన్ మీడియా చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. 70 ఏళ్ల పుతిన్.. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని బ్రిటన్ మీడియా ఆరోపిస్తోంది. ఇప్పటికే పుతిన్ లో పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పింది. పుతిన్ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందని.. సన్నిహితులు, అతిథులతో కూడా చాలా దూరం పాటిస్తున్నారని వెల్లడించింది.
పుతిన్ నిత్యం వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉంటారు. ఇప్పటికే ఆయనకు గుర్రపు స్వారీ అంటే ఇష్టం. అయితే క్యాన్సర్ లాంటి రోగాలకు చికిత్సలో భాగంగా ఇచ్చే స్టెరాయిడ్స్ తో మెదడు రుగ్మతతో బాధపడుతున్నారని యూకే మీడియా తెలిపింది. గత ఐదేళ్లుగా పుతిన్ తీసుకునే నిర్ణయాల ద్వారా ఈ విషయం అర్థమవుతుందని స్పష్టం చేసింది.
అలాగే మార్చి మొదటి వారంలో యూకే విదేశాంగ కార్యదర్శి లార్డ్ డేవిడ్ ఓవెన్ పుతిన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ స్టెరాయిడ్లను తీసుకుంటారని.. ఇది ఆయన దూకుడును పెంచుతుందని ఆరోపించారు.
ఆయనకు అనారోగ్య కారణంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారేమో తెలియదు కానీ.. పుతిన్ రోగనిరోధక శక్తి నశించిపోయిందన్నారు.
పుతిన్ నిర్ణయం వెనుక సైకలాజికల్ కారణం ఉన్నదని 'ది ఫైవ్ బస్' అనే నిఘా కూటమి పేర్కొంది. పుతిన్ లో అస్థిర ప్రవర్తన పెరిగిందని.. వచ్చిన అతిథులతో క్రెమ్లిన్ కు దూరంగా ఉంటూ సమావేశం అవ్వడం వంటి సందర్భాలను పుటేజీల్లో వారు ఉదహరిస్తున్నారు.
గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై చాలా వార్తలు, ఊహాగానాలు ప్రసారం అయ్యాయి. మరి బ్రిటన్ మీడియా కథనాలపై పుతిన్ సర్కార్ ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.