Begin typing your search above and press return to search.
ప్రముఖులకు షాకిస్తూ బ్లాక్ లిస్టు సిద్ధం చేసిన పుతిన్.. ఎవరెవరంటే?
By: Tupaki Desk | 23 April 2022 2:40 AM GMTతనకు తోచినట్లుగా.. తన ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించే కొందరు బలవంతులు ప్రపంచంలోని కోట్లాది మందిని ప్రభావితం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజల్ని అతి కొద్ది మంది ప్రముఖులు.. సంపన్నులు.. రాజకీయ బలవంతులు తరచూ ప్రభావితం చేయటమే కాదు.. వారి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంటారు.
ఇది చదివిన వెంటనే మీ మనసు నో అనొచ్చు కానీ కాస్తంత లోతుగా ఆలోచిస్తే ఈ విషయం మీకు ఇట్టే అర్థమవుతుంది. రష్యాను పాలిస్తున్న పుతిన్ అనే వ్యక్తి.. తన వ్యక్తిగత స్వార్థం కోసం.. తన రాజకీయ నిర్ణయాల్లో భాగంగా ఉక్రెయిన్ మీద కన్నేసి.. దాన్ని సొంతం చేసుకోవటానికి చేస్తున్న యుద్దం కోట్లాది మంది ఉక్రెయిన్లను మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రతి మూల ఉన్న పౌరుడ్ని ప్రభావితం చేస్తున్న వైనమే ఇందుకు నిదర్శనం.
పుతిన్ చేస్తున్న ఉక్రెయిన్ యుద్దం కారణంగా పెట్రోల్ మంట నశాళానికి అంటటమే కాదు.. వంట నూనెలు సలసలా కాగుతున్న పరిస్థితి. ఇలా చూసినప్పుడు ఒక బలవంతుడు ప్రపంచాన్ని తన నిర్ణయాలతో ఎంతలా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది. పుతిన చేస్తున్న యుద్ధంపై పలువురు ప్రముఖులు అతడ్ని వ్యతిరేకించటం తెలిసిందే. కొందరు దిగ్గజ వ్యాపారులైతే రష్యాలో తమ వ్యాపారాల్ని క్లోజ్ చేసేందుకు సైతం వెనుకాడలేదు. ఇలాంటి నిర్ణయాల్ని తీసుకున్న వేళ.. పుతిన సైతం తనదైన శైలిలో నిర్ణయాల్ని తీసుకోవటం షురూ చేశారు.
ఓవైపు ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తూనే.. మరోవైపు తనను వ్యతిరేకిస్తున్న వారిపై కత్తి దూయటం షురూ చేశారు. యుద్దం చేస్తున్నాన్న పేరుతో రష్యాపై ఆంక్షలు విధిస్తారా? అంటూ ప్రతీకారంతో తాను ఒక బ్లాక్ లిస్టు తయారు చేసి.. వరుస పెట్టి పలువురిపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ పై బ్యాన్ విధించిన పుతిన్.. తాజాగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ను కూడా చేర్చింది.
బ్యాన్ లో భాగంగా అమెరికాకు చెందిన 29 మంది రాజకీయ.. వ్యాపారవేత్తలతో పాటు కెనడాకు చెందిన 61 మంది ప్రముఖులపైనా బ్యాన్ విధించినట్లుగా రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది. రష్యా ప్రకటించిన బ్యాన్ లిస్టులో ఉన్న వ్యాపార ప్రముఖుల్ని.. వారి సంస్థల్ని (ఫేస్ బుక్, ఇన్ స్టా, లింక్డిన్ తదితర) ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనటం గమనార్హం. పుతిన్ సర్కారు నిషేధాన్ని విధించిన కొందరు ప్రముఖుల్ని చూస్తే..
- లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ
- ఏబీసీ న్యూస్ టెలివిజన్ ప్రెజెంటర్ జార్జ్ స్టెఫానోపౌలోస్
- వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ డేవిడ్ ఇగ్నేషియస్
- పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ
- అమెరికా డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ కాథ్లీన్ హిక్స్