Begin typing your search above and press return to search.
పుతిన్ కీలక నిర్ణయం ?
By: Tupaki Desk | 4 May 2022 6:24 AM GMTరష్యా అధినేత వ్లాదిమర్ పుతిన్ అధ్యక్షుడిగా తప్పుకోవాలని అనుకుంటున్నారా ? అవునంటు అమెరికాకు చెందిన మీడియా చెప్పిన ప్రకారమైతే ఇలాగే అనుకోవాలి. ఒకవైపు ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలై దాదాపు రెండు నెలలవుతోంది. ఇంకా ఎన్నిరోజులు యుద్ధం చేయాల్సుంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. పోనీ రెండు నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా సాధించింది ఏమైనా ఉందా అదీ లేదు.
నిజంగా చెప్పాలంటే ఉక్రెయిన్ కు జరిగిన నష్టం ఒకటైతే రష్యాకు జరిగిన నష్టం మరో విధంగా ఉంది. రష్యా ముందు ఉక్రెయిన్ చిట్టెలుక లాంటిదనే చెప్పాలి. కానీ రెండు నెలలుగా రష్యాని ఉక్రెయిన్ ఏదో రూపంలో సతాయిస్తునే ఉందంటే అది రష్యాకే అవమానం.
నైతికంగా యుద్ధంలో ఇప్పటికే రష్యా ఓడిపోయినట్లే అనుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో పుతిన్ విషయంలో ఒక వార్త వెలుగుచూసింది. అదేమిటంటే తొందరలోనే అధ్యక్ష స్థానం నుండి పుతిన్ తప్పుకోబోతున్నట్లు.
జీవితకాలం తానే అధ్యక్షుడిగా ఉండాలని పుతిన్ కోరుకుంటున్నారు. ఇప్పటికే 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్ రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. అయితే ఇపుడు పుతిన్ ఆలోచనకు కారణం అనారోగ్యమే అంటున్నారు. చాలాకాలంగా అధ్యక్షుడు క్యాన్సర్ తో బాధపడుతున్నారట. దీనికోసం ప్రత్యేకంగా ఒక రిసార్ట్స్ లో చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చికిత్సలో భాగంగానే తన అధ్యక్ష బాధ్యతలను పుతన్ వేరొకరికి అప్పగించబోతున్నారంటు అమెరికన్ మీడియా కథనాలు ఇస్తోంది. చికిత్సలో తన ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతే అధికారం పట్రుషేవ్ చేతిలోకి వెళుతుందని మీడియా చెబుతోంది.
ఇదే సమయంలో పుతిన్ పైనా యుద్ధంపైనా అమెరికా మీడియాతో పాటు యూరోపు మీడియా అదేపనిగా వ్యతిరేక వార్తలు, కథనాలు అందిస్తోందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. సరే ఎవరి వార్తలు, కథనాలు ఎలాగున్నా యుద్ధం మొదలై రెండు నెలలైనా ఉక్రెయిన్ పై రష్యాకు సంపూర్ణ ఆధిపత్యం దక్కలేదంటే రష్యా ఫెయిల్యూరనే చెప్పాలి.