Begin typing your search above and press return to search.
ప్రపంచ దేశాలకు తాజాగా పుతిన్ ఇచ్చిన వార్నింగ్ ఇదే
By: Tupaki Desk | 6 March 2022 3:39 AM GMTఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ మరింతగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్దంలో అతడి ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తన మానాన తాను ఉండే జపాన్ సైతం.. తాను పాటించే ధోరణికి భిన్నంగా రష్యాకు వ్యతిరేకంగా.. ఉక్రెయిన్ కు అనుకూలంగా స్పందించటం.. రక్షణ సామాగ్రిని భారీగా పంపటం తెలిసిందే. రోజులు గడుస్తున్నకొద్దీ ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్దం ముదురుతోంది. త్వరగా ముగిసిపోతుందన్న దానికి భిన్నంగా తాజా యుద్దం మరిన్ని రోజులు సాగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాను ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ యుద్ధాన్ని చేస్తున్నట్లుగా పుతిన స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. ఉక్రెయిన్ కు మాట సాయం నుంచి ఎలాంటి సాయం చేసినా.. కూడా వారు తమ శత్రువులే అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ తాజాగా సంచలన వార్నింగ్ ఇచ్చేశారు.
సైనిక చర్య పేరుతో దాదాపు పది రోజుల క్రితం ఉక్రెయిన్ మీద దాడి మొదట్లోనే.. ఉక్రెయిన్ కు సాయం చేయొద్దన్న మాటతో పాటు.. తమకు వ్యతిరేకంగా పని చేసేవారి సంగతి చూస్తామన్న విషయాన్ని ఓపెన్ గానే చెప్పేశారు.
తాజాగా మరోసారి తన వార్నింగ్ ను రిపీట్ చేవారు. తాజా యుద్దం నేపథ్యంలో ఇటీవల పలుదేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీనిపై మండిపడ్డ పుతిన్.. తమపై ఆంక్షలు విధించటం కూడా యుద్దంతో సమానమని ప్రకటించటం గమనార్హం. ఇందుకు నాటో దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
తాజాగా మహిళా పైలెట్లతో సమావేశమైన ఆయన.. తమ యుద్ధం గురించి అనుకున్న దాని కంటే భీకరంగా తాము యుద్ధం చేస్తామని చెప్పారు.
ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా విధించిన ఏ దేశమైనా సరే.. ప్రస్తుత వివాదంలోకి వచ్చేసినట్లేనని చెప్పిన పుతిన్.. ఆయా దేశాలు తమతో యుద్ధంలో పాలు పంచుకున్నట్లుగా పరిగణిస్తామన్నారు. వారంతా రష్యాతో ఘర్షణకు సిద్ధపడాలన్నారు.
మొత్తంగా నాటో దేశాలకు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్న పుతిన్ వైఖరి ఇప్పుడు అంచనాలకు అందటం లేదు. తమ డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం ఆగదని చెబుతున్న ఆయన.. ఉక్రెయిన్ తమ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లుగా చెప్పి తన తీరును సమర్థించుకోవటం గమనార్హం. మరి.. పుతిన్ తాజా వార్నింగ్ కు మిగిలిన దేశాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.