Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ దెబ్బతో పుతిన్ లో బ్యాలెన్స్ మిస్
By: Tupaki Desk | 22 Sep 2022 4:31 AM GMTమహా అయితే వారం.. కాదంటే మరో మూడు రోజులు.. మొత్తంగా పది.. పదిహేను రోజుల్లో తాను టార్గెట్ చేసిన ఉక్రెయిన్ ను సొంతం చేసుకోవచ్చన్న ధీమాతో పుతిన్ మొదలు పెట్టిన ఉక్రెయిన్ దురాక్రమణను.. ప్రపంచంలో అత్యధిక మీడియా సంస్థలు రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధమనే మాటనే ప్రస్తావించిందే తప్పించి.. బల ప్రదర్శన.. దురాక్రమణ లాంటి వ్యాఖ్యల్ని చేసింది లేదు. పుతిన్ అంచనాలు భారీగా తప్పి.. వరుస ఎదురుదెబ్బలు పడుతున్న వేళ.. రష్యా అధినేత నోటి నుంచి వచ్చిన తాజా మాటల్ని వింటే.. ఆయనలో అసహనం హద్దులు దాటేస్తుందా? అన్న సందేహం కలుగక మానదు.
తాజాగా ఉక్రెయిన్ పై రష్యా అధినేత కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి మూడు లక్షల మంది రిజర్వు సైనికుల్ని పంపిస్తామని చెప్పిన ఆయన.. ఉక్రెయిన్ లో రష్యా బలగాలు కేవలం ఉక్రెయిన్ సైన్యంతో మాత్రమే పోరాటం లేదన్నారు.
మొత్తం పశ్చిమ దేశాల సైనిక శక్తిని ఎదుర్కొంటున్నట్లుగా అభివర్ణించిన ఆయన. వారిపై పోరాడాలంటే మరిన్ని బలగాల్ని పంపించక తప్పదన్న మాట వింటే.. ఉక్రెయిన్ ఎపిసోడ్ లో ఆయన ఎదుర్కొంటున్న ఒత్తిడి ఎంతలా ఉందన్నది అర్థమవుతుంది.
తనకు తానుగా ఉక్రెయిన్ మీద దురాక్రమణకు తెర తీసిన పుతిన్.. తాజాగా చేసిన ప్రసంగంలో మాత్రం.. రష్యాను బలహీనం చేసి.. విభజించి.. నాశనం చేయటమే వాటి లక్ష్యమని పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. రష్యా మీద అణుదాడులు జరగొచ్చొంటూ పశ్చిమ దేశాలు పదే పదే బ్లాక్ మొయిల్ చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాను బెదిరించే వారిని తాను చెప్పేది ఒక్కటేనన్న పుతిన్.. రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి.. నాటో దేశాల కంటే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ తమ వద్ద ఉందన్న మాటను చూస్తే.. పుతిన్ ఫస్ట్రేషన్ ఎంత పీక్స్ లో ఉందో అర్థమవుతంది.
రష్యాకు ముప్పు ఉందని భావించినప్పుడు అణు ఆయుధాల్ని తాము తప్పక ఉపయోగిస్తామని.. ఆ విషయంలో తాను జోక్ చేయటం లేదని చేసిన వార్నింగ్ చూస్తే.. పుతిన్ తప్పు మీద తప్పు చేస్తున్నారన్న మాట అర్థం కాక మానదు.
ఉక్రెయిన్ విషయంలో తనకు తాను వేసుకున్న పీటముడులు వేసుకున్న పుతిన్..ఇప్పుడు అణు ఆయుధాల ప్రస్తావన తేవటం ద్వారా.. తాను ఉన్న ఇబ్బందికర పరిస్థితిని చెప్పకనే చెప్పేస్తున్నట్లుగా అర్థమవుతంది. మొత్తంగా చూస్తే.. వరుస పెట్టి తగులుతున్న ఎదురుదెబ్బలు పుతిన్ లో బ్యాలెన్సు మిస్ అయ్యేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.