Begin typing your search above and press return to search.
ప్లీజ్ మోడీ.. పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 23 Jun 2022 12:39 PM GMTఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ యుద్ధాన్ని ప్రపంచదేశాలన్నీ ఖండిస్తున్నా.. ఒత్తిడి తెస్తున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచదేశాలకు చెందిన వేలాది దిగ్గజ కంపెనీలు రష్యాలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. పుతిన్ మాత్రం ప్రపంచదేశాలతో వ్యాపార ఒప్పందాలు చేసి రష్యాకు పున: వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
బ్రిక్స్ దేశాలతో రష్యా వ్యాపార సంబంధాలు మరింతగా బలోపేతం చేసేందుకు పుతిన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రష్యా సమాఖ్య, బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం 38 శాతం పెరిగి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రష్యాలో రీటైల్ స్టోర్ లను ప్రారంభించేందుకు ప్రధాని మోడీతో ఒప్పిస్తున్నామని.. రష్యా దేశీయ మార్కెట్ లో చైనా కార్లు, ఇతర ప్రొడక్ట్ లు, హార్డ్ వేర్ వాటాల్ని పెంచేలా చర్చిస్తున్నట్టు తెలిపారు. తద్వారా బ్రిక్స్ దేశాలలో రష్యా ఉనికి పెరుగుతుందని పుతిన్ అభిప్రాయపడ్డారు.
రష్యా నుంచి ఎక్కువ చమురు దిగుమతి చేసుకోవాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, పాశ్చాత్య దేశాలు భగ్గుమన్నా కూడా మోడీ వెనక్కి తగ్గలేదు. దిగుమతులలో 2శాతం లేకున్నా కూడా అమెరికా సహా ఆ దేశాలు గగ్గోలు పెట్టాయి. ఇక ఐరోపా ఏకంగా రష్యా నుంచి చేసుకున్న చమురులో భారత్ చేసుకుంది చాలా తక్కువ. 2 శాతం కూడా ఉండదు. భారత్ సైతం ఈ చమురు కొనుగోళ్లను సమర్థించుకుంది.
ఇక రష్యా కూడా బ్రిక్స్ దేశఆలకు పెద్ద మొత్తంలో ఎరువులను ఎగుమతి చేస్తోంది. రష్యా ఐటీ కంపెనీలు భారత్, దక్షిణాఫ్రికాలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని పుతిన్ తెలిపారు. రష్యాలో భారత్ రీటైల్ స్టోర్లను ప్రారంభించేందుకు మోడీ సర్కార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం బిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఉక్రెయిన్ పై రెండు నెలలుగా రష్యా కొనసాగిస్తున్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడి ఐటీ కంపెనీల కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి సంస్థలన్నీ ఎత్తేశాయి. అక్కడి కార్యకలాపాలను భారత్ సహా ఇతర దేశాలకు తరలించడంపై దృష్టి సారిస్తున్నామని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.భారత్ తోపాటు ఫిలిప్పీన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ దేశాలకు ఐటీ ప్రాజెక్టులు తరలిపోతాయని ఫ్రాన్స్ కు చెందిన ఐటీ కన్సల్టింగ్ సేవల సంస్థ ఆటోస్ వెల్లడించింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో ఆ 2 దేశాల్లో నిర్వహిస్తున్న ఐటీ ప్రాజెక్టులను వేరే ప్రాంతాలకు బదిలీ చేసేందుకు చూస్తున్నామని ఐటీ వర్గాలు చెబుతున్నాయి.
. రష్యాలో ఐటీ కార్యకలాపాలు కొనసాగించలేమని.. అక్కడ నిర్వహిస్తున్న ప్రాజెక్టులను భారత్, టర్కీకి మళ్లిస్తామని స్పష్టం చేశారు.ఇలా వచ్చే ప్రాజెక్టుల్లో కొన్ని హైదరాబాద్ కు చేరుతాయని.. అందువల్ల ఇక్కడ ఐటీ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని స్థానిక ఐటీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా ఇంజనీరింగ్ పరిశోధన.. అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్, బ్యాంక్ ఆఫీస్ నిర్వహణ, కస్టమర్ సపోర్ట్, మెయింటెనెన్స్ షేర్డ్ సర్వీసెస్ విభాగాల ఉద్కయోగాలు ఇక్కడకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల కొత్తగా 50000-60000 వరకూ ఉద్యోగాలు లభిస్తాయని అంచనావేస్తున్నారు.యుద్ధం ముగిసినా కూడా కొన్ని ప్రాజెక్టులకు సంబంధిత క్లయింట్లు మనదేశంలోనే కొనసాగించే అవకాశం ఉంటుంది. తద్వారా ఇక్కడి ఐటీ రంగానికి, నిపుణులకు మేలు జరుగుతుంది..
ఇన్నాళ్లు తూర్పు ఐరోపా దేశాలైన రుమేనియా, బల్గేరియా, మాల్డోవా, పోలెండ్ తోపాటు బెలారస్, ఈస్తోనియా, లాత్వియా, లిథువేనియా వంటి దేశాలు తమ ఐటీ అవసరాల కోసం ఉక్రెయిన్ , రష్యా దేశాల మీద ఆధారపడి ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు కూడా రష్యా, ఉక్రెయిన్ లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ యుద్ధం నేపథ్యంలో తమ కార్యకలాపాలు సజావుగా సాగించుకోలేక ఇప్పుడు ఇతర చీప్ గా మానవవనరులు దొరికే దేశాల వైపు వీరు చూస్తున్న పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలోనే భారత్ తో స్నేహహస్తం అందించేందుకు పుతిన్ ముందుకు రావడం విశేషంగా మారింది.