Begin typing your search above and press return to search.
మోదీకి పుతిన్ ఫోన్ కాల్ పై స్పందించిన అమెరికా..!
By: Tupaki Desk | 17 Dec 2022 10:32 AM GMTవచ్చే ఏడాది సెప్టెంబర్లో భారత్ జీ 20 సదస్సుకు అతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని భారత్ బెంగూళూరు.. ముంబై.. జైపూర్లో నిర్వహించేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కేంద్రం జీ 20 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల కిందట ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జీ 20 సదస్సు భారత్ అతిథ్యం ఇవ్వనుండటంపై పుతిన్ సంతోషం వ్యక్తం చేసి ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటానని మోదీకి పుతిన్ సూచనప్రాయంగా తెలిపారు. ఉక్రెయిన్ వార్ కు సంబంధించిన కీలక విషయాలతోపాటు షాంఘై కో ఆపరేషన్లో ప్రస్తావనకు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
పుతిన్-మోదీన్ ఫోన్ సంభాషణపై అమెరికా సైతం తాజాగా స్పందించింది. యుద్ధం ముగించేందుకు దౌత్య ప్రక్రియలే మార్గమన్న మోదీ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని అమెరికా ప్రకటించింది. అయితే ఆయన సూచనలు ఆచరణలో అమలైనపుడు తాము సైతం యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి మిత్ర దేశాలతో కలిసి పని చేస్తామని అమెరికా వెల్లడించింది.
రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలకు సొంత నిర్ణయాలు ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించడంపై భారత్ పాత్ర ఏంటి.. అని మీడియా ఆయనను ప్రశ్నించగా ''యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు పాటు పడాలనే ఆసక్తి ఉన్న ఏ దేశమైనా.. ఉక్రెయిన్ మిత్ర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని'' పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రష్యా-భారత్ దేశాధినేతల మధ్య ఈ ఏడాది కాలంలో ఐదుసార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగిన సమయంలో మోదీతో పుతిన్ మాట్లాడారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ లో ఉబ్బెకిస్థాన్ లోని సమర్ ఖంద్ లో జరిగిన సదస్సులో వీరద్దరు ప్రత్యక్షంగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సమయంలోనే 'ఇది యుద్ధాల యుగం కాదు..' అని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు హితవు పలికారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.