Begin typing your search above and press return to search.
పుతిన్ మనసును దోచుకున్న అమెరికా నేత
By: Tupaki Desk | 18 Dec 2015 5:12 AM GMTతన వివాదాస్పద వ్యాఖ్యతో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన అమెరికా నేత డోనాల్డ్ ట్రంప్. అమెరికా లాంటి ఉదారవాద దేశంలో.. ట్రంప్ లాంటి నేతను అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఊహించలేని పరిస్థితి. అమెరికాకు వచ్చే ముస్లింలను రానివ్వకూడదని.. ఐఎస్ తీవ్రవాదుల పడగనీడ అమెరికా మీద పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్య ఎంత కలకలాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే ఇంకేమైనా ఉందా? అన్నఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయనకు అనుకోని విధంగా.. అనుకోని వైపు నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించటమే కాదు.. ఆయనలాంటి వ్యక్తే అమెరికాకు అధ్యక్షుడు కావాలన్న వ్యాఖ్య రావటం విశేషం. రష్యా అధ్యక్షుడిగా.. తిరుగులేని అధికారాల్ని అనుభవిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ట్రంప్ కు తన పూర్తి మద్దతు ప్రకటించారు.
గురువారం మాస్కోలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ట్రంప్ ను.. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల్ని సమర్థించటం గమనార్హం. అమెరికా అధ్యక్ష పదవికి ఆయనే సరైన వ్యక్తి అని చెప్పటమే కాదు.. నిస్సందేహంగా ఆయన ప్రతిభాశాలి అని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యల్ని స్టేజ్ మీద కాకుండా.. స్టేజ్ దిగిన తర్వాత వ్యాఖ్యానించటం గమనార్హం.