Begin typing your search above and press return to search.
పుతిన్ కుడిచేయి చాలా స్పెషల్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 4 March 2022 12:30 AM GMTపుతిన్.. పుతిన్.. పుతిన్... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దృష్టి పుతిన్ పైనే ఉంది. ఆయన ఏం చేసినా... ఏది మాట్లాడినా స్పెషల్ ఫోకస్ అవుతోంది. అందుకు కారణం యుద్ధం. ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగడమే ఓ సెన్షేషన్. ఈ వార్ ను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
అమెరికా లాంటి అగ్రరాజ్యాలు పుతిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా... భీకర యుద్ధం చేస్తున్నారు. తనను ఎవరైనా ఎదురిస్తే... హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే అణ్వాయుధాలు వాడాలని సైనికులకు ఆదేశాలు ఇచ్చారు. మరి ఇలాంటి పవర్ ఫుల్ పుతిన్... నడక ఆసక్తిగా మారింది. అందరికంటే నడకలోనూ పుతిన్ స్టైల్ వేరయ్యా... అంటున్నారు. అంతేకాకుండా ఆయన కుడి స్పెషల్ ఫోకస్ అవుతోంది.
సహజంగా నడిచేటప్పుడు కాళ్ళు, చేతులూ కదిలిస్తూ నడుస్తాం. కానీ పుతిన్ అలా కాదు. ఆయన ఎప్పుడు నడిచినా కేవలం ఎడమ చేతిని మాత్రమే కదిలిస్తారు. ఎంత వేగంగా నడిచినా కుడి చేతిని మాత్రం కదిలించరు. అలాగే ఆ చేయి బిగుసుకుపోయి ఉంటుంది. కొంచెం కూడా కదలదు. ఆయన వ్యవహార శైలీ లాగే... నడక కూడా అంతే స్పెషల్ గా ఉంటుంది.
అయితే ఇలా ఎందుకు నడుస్తారనేది సందేహం. దీనినే ఆల్ఫా మేల్ స్టైల్ అంటారని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. వీళ్లు సాధారణం కన్నా కాస్త భిన్నంగా నడుస్తారని చెబుతున్నారు.
పుతిన్ చాలా చిన్నవయసులోనే గూఢచర్యంలో పని చేశారు. కేజీబీలో గూఢచారిగా విధులు నిర్వర్తించారు. అనేక దేశాల్లోనూ ఆయన రహస్యంగా పలు కార్యకలాపాలు నిర్వహించారు. అనంతరం సోవియట్ యూనియన్ పతనం... ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పుతిన్ రాజకీయ అరంగేట్రం చేశారు.
అయితే గూఢచర్యంలో ఉన్నప్పుడు తొలుత వారికి ఆయుధ శిక్షణ ఇస్తారు. వారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల కంటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఆయుధాన్ని ధరించాలి. ఇక కుడి ఎల్లప్పుడూ ఆయుధాన్ని వాడడానికి అనుకూలంగా ఉండాలి. ఆయుధానికి చాలా దగ్గరగా ఉండాలి. ఈ విధంగా వారికి శిక్షణ ఇస్తారు.
ఈ శిక్షణలో భాగంగా కుడి చేయి ఆయుధానికి దగ్గరగా ఉండటం వల్ల శత్రువుపై వేగంగా దాడి చేయవచ్చు. అయితే కాలక్రమేణా వారికి అదే అలవాటుగా మారుతుంది. కుడిచేయి కదలకుండా ఎల్లప్పుడూ అలా నిటారుగానే ఉంటుంది. ఈ క్రమంలోనే నడిచేటప్పుడు కూడా వాళ్లు కుడిచేతిని కదిలించడం మరిచిపోతారు. పుతిన్ కు కూడా అదే అలవాటుగా మారింది. అందుకే పుతిన్ అప్పుడు... ఇప్పుడు అలాగే ఉండిపోయారు. ఆయన వ్యవహార శైలితో పాటు నడక కూడా సో స్పెషల్ అన్నమాట.
ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం సాగుతోంది. రాజధాని కీవ్ పై బాంబుల మోత మోగుతోంది. ఇప్పటికే అక్కడ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నో దేశాలు వ్యతిరేకిస్తున్నా కూడా రష్యన్ బలగాలు దూసుకుపోతున్నాయి. అందుకు ఉక్రెయిన్ సైన్యం కూడా ఎదురొడ్డి నిలుస్తోంది.