Begin typing your search above and press return to search.
అణ్వాయుధాలు సిద్ధం చేయండి..: పుతిన్ సంచలన ఆదేశాలు?
By: Tupaki Desk | 28 Feb 2022 2:16 AM GMTరష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలు కలిగిన ఉన్న స్విప్ట్, ప్రపంచ బ్యాంకు నుంచి రష్యాను దూరం పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కన్నెర్ర జేసినట్లు సమాచారం. దీంతో అణ్వాయుధాలు సిద్ధం చేయాలని సైనికులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకుఉక్రెయిన్ పై మాత్రమే దాడి చేస్తున్న రష్యా ముందు ముందు ఏ దేశంపై విరుచుకుపడుతుందోనన్న చర్చ సాగుతోంది. ఉక్రెయిన్ పై ఇప్పటికే బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా తమ దేశ సైనికులకు మరింత అప్రమత్తం చేస్తూ యుద్ధానికి సిద్ధం కావాలని సంకేతాలు పంపుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
నాటో పై వ్యతిరేకంగా ఉన్ పుతిన్ ఆ దేశాలతో తమకు ఎప్పటికైనా ముప్పు ఉందని గ్రహించారు. అయితే ఇందులో భాగంగా ఉక్రెయిన్ ను కట్టడి చేస్తే మిగతా దేశాలకు హెచ్చరికలు పంపినట్లు అవుతుందని పుతిన్ భావిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం లేకపోవడం వల్ల యూరోపియన్ దేశాలు బలగాలను పంపడంలో వెనుకాడుతున్నాయి. కానీ రష్యా యుద్ధం ఆపేందుకు మాత్రం రకరకాల కట్టడిలు చేస్తున్నారు. ప్రపంచ సమాచార కేంద్రంగా పనిచేస్తున్న ‘స్విప్ట్’.. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ప్రపంచ బ్యాంకు నుంచి రష్యాను దూరంగా పెట్టాలని నిర్ణయానికి రానున్నారు. అయితే సోమవారం భద్రతా మండలి సమావేశంలో జరిగే చర్చపై ఆధారపడనుంది.
కానీ ఇంతలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన కామెంట్స్ చేశారు. అణ్వాయుధాల బలగాలను సిద్ధం చేయాలని సైనికులను ఆదేశించారు. ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని, ఈ క్రమంలో పుతిన్ అణు దాడికి కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ దేశాలు మనతో సఖ్యంగా లేకపోవడంతో పాటు మనపై విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అణు ఆయుధాలను సిద్ధం చేయాలని రక్షణ మంత్రి, రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ చీఫ్ ను ఆదేశించారు.
అయితే పుతిన్ చేసిన వ్యాఖ్యలపై నాటో దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అణు యుద్ధానికి కూడా పుతిన్ రెడీ కావడంపై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యంత భారీ ఆయుధాలతో పాటు అణు ఆయుధాలను రష్యా మాత్రమే కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా కనుక రెచ్చిపోతే ప్రపంచ మొత్తం అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నాటో కూటమి సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలె్టెన్ బర్గ్ మండిపడుతున్నారు. బాధ్యతయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మట్లాడడం సరికాదన్నారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేందుకు రష్యా దుందుడుకు చర్యలను మానుకోవాలని హితువు పలికారు.
ఇప్పటికే ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించిన రష్యా ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.అయితే అణు ఆయుధాలను సిద్ధం చేయండి.. అన్న వ్యాఖ్యలు ఇతర దేశాలను కూడా టార్గెట్ చేయడానికి రెడీ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
దీంతో మిగతా దేశాలు కూడా అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నాటో దేశాలు రంగంలోకి దిగితే యుద్ధం తీవ్రంగా ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సమర్థించుకుంటారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో నాటో దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.