Begin typing your search above and press return to search.
పుతిన్ గురువు కుమార్తె.. దేశం విడిచి వెళ్లింది అందుకేనా?
By: Tupaki Desk | 28 Oct 2022 7:30 AM GMT2022 ఫిబ్రవరిలో మొదలయిన రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఎనిమిది నెలలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదట్లో ఉక్రెయిన్‌పై సులువుగా విజయం సాధించేలా కనిపించిన రష్యా ఎదురీదుతోంది. అమెరికా, దాని మిత్ర దేశాలు అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ గట్టిగా పోరాటం చేస్తోంది. మొదట్లో తమ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఒక్కొక్కటిగా ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో రేడియో ధార్మిక వ్యర్థాలను వెదజల్లే బాంబుల్ని ఉక్రెయిన్ ప్రయోగించే అవకాశం ఉందని రష్యా ఆందోళన చెందుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి సెర్గే షొయిగు ఆందోళన వెలిబుచ్చారు. ఇలా చేయడం వల్ల అణు విస్ఫోటం మాదిరి విపరిణామాలు లేకపోయినా అనేక ప్రాంతాలపై రేడియో ధార్మికత ప్రభావం పడుతుందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారీ ఎత్తున సైనికుల అవసరం పడుతుండటంతో రష్యా తమ దేశంలో నిర్బంధ సైనిక సమీకరణ అమలు చేస్తోంది. ఈ క్రమంలో యువతను బలవంతంగా సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పంపిస్తోంది.
ఈ నేపథ్యంలో చాలామంది పౌరులు దేశాన్ని వదలి వెళ్లిపోతున్నారు. మరోవైపు పుతిన్‌ను వ్యతిరేకించే నిరసనకారులు, ఆయన వ్యతిరేకులు కూడా ఇప్పటికే దేశం వదిలేసి వెళ్లిపోయారు.
కాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ గురువైన అనటోలి సొబ్‌చాక్ కుమార్తె, ప్రముఖ జర్నలిస్ట్ అయిన సెనియా సొబ్‌చాక్(40) రష్యాను వీడి వెళ్లిపోవడం సంచలనం రేపుతోంది.
సెనియా పనిచేస్తోన్న మీడియా సంస్థ డైరెక్టర్‌ను పోలీసులు ఓ కేసులో ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సెనియా ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆమెను అరెస్టు చేసేందుకు వారెంట్ కూడా పోలీసులు వద్ద ఉన్నట్లు రష్యా మీడియా ఏజెన్సీ తెలిపింది. దీంతో ఆమె అరెస్ట్ ఖాయమన్న వార్తలు వెలువడ్డాయి. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన సెనియా తమ మీడియా సంస్థపై కక్షతోనే దాడులు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, రష్యాను వీడి లిథువేనియాకు వెళ్లిపోయారు.
కాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని మొదటి నుంచి సెనియా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్‌పై అనవసర యుద్ధం ఎందుకని ఆమె పుతిన్‌ను పలుమార్లు బహిరంగంగానే నిలదీశారు.
గతంలో 2012 ఎన్నికలకు ముందు క్రెమ్లిన్ వ్యతిరేక నిరసనల్లో సెనియా పాల్గొన్నారు. 2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేసిన సెనియా 2 శాతం ఓట్లు సాధించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.