Begin typing your search above and press return to search.
తనకు వార్నింగ్ ఇచ్చిన బైడెన్ కు.. ఫోన్ లో హెచ్చరించిన పుతిన్
By: Tupaki Desk | 1 Jan 2022 5:30 AM GMTఒక వెలుగు వెలిగి.. కాలానికి చిక్కిన రష్యా ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికి తెలిసిందే. ఆ దేశాన్ని ఏలుతున్న పుతిన్.. మిగిలిన రాజకీయ నేతలకు చాలా భిన్నమైన అధినేతగా చెప్పాలి. ఒక పట్టాన కొరుకుడుపడని అతడి తీరు తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యాధినేతకు ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చేసిన వైనం సంచలనంగా మారింది. ఇంతకూ జరిగిందేమంటే.. ఒకప్పటి సోవియెట్ యూనియన్ లో భాగం.. ఇప్పుడు ప్రత్యేక దేశంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నారన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ జోలికి రష్యా వస్తే.. అందుకు తగ్గట్లు..కఠిన ఆంక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అగ్రరాజ్య అధినేత బైడెన్ చేసిన వార్నింగ్ కు.. అంతే స్థాయిలో రియాక్టు అయ్యారు జో బైడెన్. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో రష్యా మీద ఆంక్షల్ని విధించేందుకు తన మిత్రపక్షాలతో సిద్ధమవుతోంది అగ్ర రాజ్యం అమెరికా. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు.. రష్యా అధినేత పుతిన్ మధ్య ఫోన్ కాల్ నడిచింది.
దాదాపు గంట పాటు సాగిన ఈ ఫోన్ కాల్ లో.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చేశారు.
తమ దేశం మీద ఆంక్షలు విదించాలని చూస్తే.. అది ఘోరమైన తప్పుగా మారుతుందని పుతిన వార్నింగ్ ఇచ్చేశారు. రష్యా అభ్యర్థ మీద ఈ సమావేశం జరిగినప్పటికీ.. పుతిన్ మాత్రం లీడ్ తీసుకొని.. బైడెన్ కు నోట మాట రాకుండా చేశారని చెప్పాలి. ఉక్రెయిన్ నను ఆక్రమించే ఉద్దేశం తనకు లేదని తేల్చిన రష్యా.. తమ సొంత భూభాగంలో దళాలు స్వేచ్ఛగా తిరగటానికి తమకు హక్కు ఉందని రష్యా పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఉక్రెయిన్ ను ఆక్రమిస్తే.. అమెరికా మిత్రపక్షాలకు ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయని.. రష్యాపై ఆంక్షలు విధించటం ఘోరమైన తప్పుగా నిలుస్తుందని చెబుతున్నారు.ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమిస్తే.. పుతిన్ ఇప్పటివరకు చూడనంత స్థాయిలో ఆంక్షల్ని చూస్తారని చెబుతున్నారు. ఇలా.. మొండితనం మూర్తీభవించిన ఈ ఇద్దరు దేశాధినేతలు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారుతుందని చెప్పక తప్పదు.