Begin typing your search above and press return to search.

తలసాని వియ్యంకుడికి సీటు కన్‌ ఫర్మ్‌

By:  Tupaki Desk   |   22 Feb 2019 11:28 AM IST
తలసాని వియ్యంకుడికి సీటు కన్‌ ఫర్మ్‌
X
చంద్రబాబుకి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. ప్రస్తుతం అదే వ్యూహ రచనలో ఉన్నట్లు కూడా చెప్పారు. అటు ఏపీలో చంద్రబాబు మాత్రం.. తలసాని వియ్యంకుడికి ఎమ్మెల్టే సీటు ఇచ్చారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌ గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్‌ తలసానికి వియ్యంకుడు.

పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మొదటి నుంచి తనకు మైదుకూరు టిక్కెట్‌ కావాలని పట్టుపడుతున్నారు. అయితే.. ఈ సీటు తనకు ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇప్పటికే చంద్రబాబుని రెండు సార్లు కలిశారు. కానీ డీఎల్‌ వైపు చంద్రబాబు మొగ్గు చూపలేదు. మైదుకూరులో బలమైన బీసీ నేతకే టిక్కెట్‌ ఇవ్వాలనేది మొదటినుంచి చంద్రబాబు ఆలోచన. అందుకే.. మైదుకూరు టిక్కెట్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కే కన్‌ ఫర్మ్‌ చేశారు. పుట్టా సుధాకర్ యాదవ్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వియ్యంకుడు అని తెలిసినా కూడా కచ్చితంగా నెగ్గే అభ్యర్థి కాబట్టే పుట్టాకు టిక్కెట్‌ ఇచ్చేశారు.

అయితే.. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కు టిక్కెట్‌ ఇచ్చే విషయంలో చంద్రబాబు చూసింది రెండు విషయాలు. తలసానికి పుట్టా ఇప్పుడు బంధువు అయ్యారు కానీ.. యనమల రామకృష్ణుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కు చాలా దగ్గరి బంధువు.ఇంకా చెప్పాలంటే.. టీటీడీ ఛైర్మన్‌ పదవి పుట్టాకు రావడం వెనుకు కూడా యనమలే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా వెనుకనుంచి చక్రం తిప్పంది యనమల రామకృష్ణుడే.