Begin typing your search above and press return to search.
పువ్వాడ సరదా పంచ్.. మాటల కోసం వెతుక్కున్న మీడియా?
By: Tupaki Desk | 17 March 2020 6:45 AM GMTఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్. ఆయనకు సంబంధం లేకున్నా వార్తగా మారిపోతున్నారు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. ఆయన నోటి నుంచి వచ్చిన సరదా వ్యాఖ్య ఆయన్ను వార్తల్లోకి వచ్చేలా చేసింది. కాకుంటే.. ఈసారి మాత్రం మంత్రి పువ్వాడలోని ‘పంచ్ మనిషి’ బయటకు వచ్చారు.
కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. దీనికి సమాధానం చెప్పుకొచ్చారు. కరోనా భయాందోళనల నేపథ్యం లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతూనే.. శానిటైజర్ల తో బస్సుల్ని తుడవటం సాధ్యం కాదని తేల్చేశారు. అయితే.. డిపోల నుంచి బస్సుల్ని బయటకు పంపేటప్పుడు మాత్రం ప్రెజర్ వాటర్ తో వాష్ చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొందరు.. శానిటైజర్ తో శుభ్రం చేయకుంటే వైరస్ ను నిర్మూలించటం కష్టం కదా? లాంటి ప్రశ్నల్ని సంధించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ప్రతిరోజూ మీరు మీ కెమెరాల్ని తుడుస్తున్నారా? మీ నోటి దగ్గర మైకులు పెట్టుకొని ప్రశ్నలు అడిగి.. తిరిగి మా నోటి దగ్గరకు మైకులు పెట్టి జవాబు చెప్పిస్తారు. మాట్లాడేటప్పుడు వాటి మీద తుంపర్లు పడుతుంటాయి. ఇందుకు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అంటూ అడిగిన ప్రశ్నలకు మీడియా ప్రతినిధుల నోట మాట రాని పరిస్థితే.
బస్సులకు శానిటైజర్లు వాడతారా? అన్న ప్రశ్నకు.. మీడియాకు పువ్వాడ వేసిన పంచ్ కారణంగా.. వారి నోటి నుంచి మాటలు రాలేని పరిస్థితి నెలకొందంటున్నారు. అయితే.. తాను వేసిన పంచ్ ను సీరియస్ గా కాకుండా సరదాగా వేయటం తో మీడియా ప్రతినిధులు సైతం లైట్ తీసుకున్నారు. అయితే.. పువ్వాడ సంధించిన ప్రశ్నలో మాత్రం వాస్తవం ఉందని చెప్పక తప్పదు. ఇంతకూ అందరికి శుభ్రం గురించి హెచ్చరికలు చేసే మీడియా.. తాము ఉపయోగించే కెమేరా.. మైకుల విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుమా.