Begin typing your search above and press return to search.
పువ్వాడ రేపిన పోలవరం వివాదం.. ఆరని మంటలు
By: Tupaki Desk | 19 July 2022 2:49 PM GMTతెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన పోలవరం ముంపు మండలాల విలీనం వ్యాఖ్యలు మంటలు రేపుతూనే ఉన్నాయి. ఏపీకి చెందిన మంత్రులు ఒకరి తర్వాత.. ఒకరుగా పువ్వాడపై విరుచుకుపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఎలాంటి గొడవలు లేవని.. కొత్తవి సృష్టించేందుకు ప్రయత్నించొద్దని కోరారు. హైదరాబాద్‌లో మాట్లాడిన అంబటి.. గోదావరికి వరదలు వచ్చినప్పుడు తెలంగాణ, ఏపీలో కొన్ని ప్రాంతాలు నీట మునుగుతాయని వెల్లడించారు.
``మనిద్దరం తెలుగు వాళ్లమే. తెలంగాణలో మీరు, ఏపీలో మేము పరిపాలన చేస్తున్నాం. రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. కొత్త వివాదాలు తీసుకురావొద్దు. నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు కేంద్రమే ఇచ్చింది. 7 మండలాలకు పోలవరం వల్ల ఇబ్బంది ఉంటుందనే వాటిని ఏపీలో కలిపారు. భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం ఎలా కారణమవుతుంది ? అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. మీరు 5 గ్రామాలు ఇవ్వమంటే.. భద్రాచలం మాది అంటాం.. ఇస్తారా ? 5 గ్రామాలు తెలంగాణకు కావాలంటే కేంద్రాన్ని అడగండి.`` అని అంబటి సూచించారు..
పోలవరం ఎత్తు విషయంలో సీడబ్ల్యూసీకి సమాచారం ఇచ్చాకే నిర్ణయం తీసుకున్నామన్నారు. గోదావరి , కృష్ణా బోర్డులు ఉన్నాయి కదా.. వాటిని సంప్రదించకుండా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున భారీ వర్షం పడినప్పుడు వరదలు రావడం సహజమని అంబటి అన్నారు.
భద్రాచలంలో కొత్తగా నీళ్లు రాలేదని, 1986లో 75 అడుగుల వరకు వచ్చాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ప్రభుత్వాలు పని చేయాలని, పోలవరం వల్లే తెలంగాణ గ్రామాలు మునుగుతున్నాయా ? అనేది సీడబ్ల్యూసీని తెలంగాణ అడగాలని సూచించారు. నిజంగా సమస్య ఉంటే ముఖ్యమంత్రులు ఉన్నారు కదా.. వారు చూసుకుంటారని అన్నారు. ఇక, ఇదే విషయంపై మంత్రి బొత్స కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
నా తప్పేంటో అర్ధం కావడం లేదు!: పువ్వాడ
మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని ఏపీ మంత్రులకు సూచించారు. హైదరాబాద్ ఇస్తారా అని బొత్స అనటం.. అసందర్భం, అర్థరహితమని స్పష్టం చేశారు. నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదన్నారు. ``జగన్‌తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించండి. 5 గ్రామాలను కలిపితేనే కరకట్టల నిర్మాణం సాధ్యం. సున్నితమైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలి. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదు. బేషజాలకు పోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలి.`` అని వ్యాఖ్యానించారు.