Begin typing your search above and press return to search.
పువ్వాడ అడిగారు.. కేసీఆర్ కాదనకుండా ఓకే చేశారట!
By: Tupaki Desk | 19 April 2019 5:09 AM GMTకొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తన ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఉదారంగా వ్యవహరిస్తారన్న విషయానికి సంబంధించిన అంశాలు విస్మయాన్ని రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 ఎన్నికలు జరిగిన తర్వా త కొన్నాళ్లకు గులాబీ కారు ఎక్కేసిన పువ్వాడ అజయ్ కు భారీ లబ్ది చేకూరుస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ భూములను మార్కెట్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించటానికి వీలుగా 2014లో ప్రభుత్వం జీవో 59ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 10వేల గజాలను తమకు క్రమబద్దీకరించాలంటూ పువ్వాడ అజయ్ అప్లికేషన్ పెట్టారు. దీనిపై కేసీఆర్ సర్కారు సానుకూలంగా స్పందించింది. ఆసక్తికరమైన విషయం ఇక్కడ ఒకటి చెప్పాలి. అప్పుడు కానీ.. అసలు విషయం అర్థంకాదు.
2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన అజయ్.. ప్రభుత్వ జీవోకు అనుగుణంగా తనకు రెగ్యులర్ చేయాలన్న అప్లికేషన్ ను పెట్టుకోగా.. అందుకు కుదరదన్న సమాధాన్ని చెప్పారు ప్రభుత్వ అధికారులు. చిత్రమైన విషయం ఏమంటే.. కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన వెంటనే.. ఆయనకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం విశేషం.
టీఆర్ ఎస్ లో చేరిన తర్వాత పువ్వాడ అజయ్ కోరిన రీతిలో 10వేల గజాల స్థలాన్ని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరించిన విషయం తాజాగా వెలుగు చూసింది.పార్టీ మారిన నేతలకు ఇంత భారీగా ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎవరు మాత్రం పార్టీ మారకుండా ఉంటారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.