Begin typing your search above and press return to search.
రావత్ తో ఏళ్లకు ఏళ్ల స్నేహం ఉన్న మిత్రుడేం చెప్పాడు?
By: Tupaki Desk | 10 Dec 2021 8:30 AM GMTఇప్పుడు దేశమంతా రావత్ గురించి మాట్లాడుకుంటోంది. అత్యుత్తమ సైనికాధిపతిగా.. త్రివిధ దళాధినేతగా సుపరిచితమైన ఆయన.. అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించటం.. దేశ ప్రజల్ని షాక్ కు గురి చేసింది. రావత్ ధైర్యసాహసాలు.. ఆయన ఆలోచన.. కమిట్ మెంట్.. దేశం కోసం ఆయన తపించే తీరు లాంటివి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాంటి వేళ.. రావత్ తో దాదాపు పదిహేనేళ్ల పాటు కలిసి పని చేసి.. ఆయన ఇంటి పక్కనే దాదాపు నాలుగేళ్లు కలిసి ఉన్న హైదరాబాదీ ఒకరు.. రావత్ కు సంబంధించిన పలు విషయాల్ని ప్రస్తావించారు.
తమ పిల్లలు.. రావత్ పిల్లలు కలిసి ఆడుకునేంత దగ్గరితనం ఉన్న ఆ మాజీ సైనికాధికారి పేరు పీవీ దుర్గాప్రసాద్. హైదరాబాద్ లోని తిరుమలగిరిలో ఉన్న ఆయన.. ఒక మీడియా సంస్థతో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రావత్ సైన్యంలో చేరే నాటికే దుర్గాప్రసాద్ సైన్యంలో పని చేస్తున్నారు. దాదాపు ఏడాది సీనియర్. వివిధ సరిహద్దుల వద్ద వీరిద్దరు కలిసి పని చేశారు. ఆ సమయంలో వీరి కుటుంబాలు లక్నోలో పక్క పక్క ఇళ్లల్లో ఉండేవారు. అంతటి స్నేహితుడైన రావత్ గురించి ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన వాటిల్లో ముఖ్యమైన అంశాల్ని చూస్తే..
- రావత్ 1978లో సైన్యంలో చేరే నాటికి నేను 5-11 గూర్ఖా రైఫిల్స్‌లో సేవలందిస్తున్నాను. రావత్ శిక్షణ 1980లో పూర్తయ్యాక.. 5-11 గుర్ఖా రైఫిల్స్‌లో సేవలందించారు. ఆ తర్వాత ఎల్‌వోసీ సమీపంలోని చకౌటి బార్డర్, వివిధ సరిహద్దు ప్రాంతాల్లో 15 ఏళ్ల పాటు కలిసి పని చేశాము. ఆపత్కాలంలో కూడా బిపిన్ మానసికంగా చాలా స్థిరంగా ఉండేవారు. ఓరోజు అతను సరిహద్దులోని అటవిక ప్రాంతంలో రౌండింగ్ కోసం ఓ హెలికాప్టర్ ఎక్కారు. ఆ హెలికాప్టర్ ఎగురుతున్న సమయంలో సాంకేతిక సమస్య రావడంతో చతికిల పడింది. వేరే వాళ్లు అయితే.. ఆ రోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. కానీ.. బిపిన్ మాత్రం మరో హెలికాఫ్టర్ ను రప్పించి.. వెళ్లి పని పూర్తి చేసుకొచ్చారు.
- ఒక రోజు మా ట్రూప్ లో ట్రైనింగ్ కోసం ఒక మేజర్ జనరల్ చేరారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త ముందుకు వెళుతున్నాం. ఆ సమయంలో మేం భోజనం చేసిన స్థలంలో ఒక్కసారిగా ఐఈడీ పేలుడు జరిగింది. ఆ టైంలో ఎవరైనా అక్కడుంటే.. వారి శరీరం ముక్కలు ముక్కలు అవుతుంది. అంతటి పేలుడుతో కొత్తగా వచ్చిన మేజర్ కాస్త జంకారు. కానీ.. బిపిన్ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకపోవటమే కాదు.. ఇలాంటివి మన దగ్గర మామూలే.. అంటూ.. పేలుడుకు చలించకుండా.. నిబ్బరంగా వ్యవహరించిన తీరు ఎప్పటికి మర్చిపోలేం.
- పాక్ సరిహద్దు చకౌటి బార్డర్‌లో పనిచేస్తున్న సమయంలో దసరా వచ్చింది. 100 మీటర్ల దూరంలో శత్రువులు పొంచి ఉంటారు. అయినా ఆరోజు తన ట్రూప్‌తో దసరా పండగ సంబురాలు జరుపుకోవాలని రావత్ భావించారు. ఈ సందర్భంగా పాక్ సరిహద్దు వరకు వెళ్లిన ఆయన.. మేం పండుగ ఉత్సవాలు జరుపుకుంటున్నామని.. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని బిపిన్ హెచ్చరించారు. ఒకవేళ తేడా వస్తే అందుకు బదులు తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని స్నేహపూర్వకంగానే చెబుతూ.. కవ్విస్తే తోక కట్ చేస్తామన్న విషయాన్ని కటువుగా చెప్పటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. ఆ తర్వాత 2 గంటల పాటు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొన్నారు. పాక్ సైన్యం ఎలాంటి కవ్వింపులకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉన్నారు.
- రావత్ ఓ జగమొండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మడమ తిప్పడు. వెనకడుగు వేయడు. ప్రమాదాలను లెక్కచేయడు. ఆ తెగువ, మొక్కవోని ధైర్యమే ఆయనను రక్షణ రంగంలో అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాయి. ఆయుధాలను రికవరీ చేయడం.. ప్రత్యర్తి వ్యూహాలను పసిగట్టడం.. ముందు జాగ్రత్త చర్యలను ప్రణాళిక బద్ధంగా అమలు చేయడం.. 1979-80 నుంచి ఎన్నో ఆపరేషన్లను విజయవంతగా పూర్తి చేయడంలో బిపిన్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే.
- రావత్ భార్య మధులికను మేమంతా ‘మధు’ అని పిలిచేవాళ్లం. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి భార్య అయినా ఆమెలో ఎక్కడా అహం కనిపించేది కాదు. అప్పట్లో నా భార్యకు స్కూటర్ కూడా నడపడం రాదని తెలుసుకున్న మధు.. ఆమెను బయటకు తీసుకెళ్లేవారు. డ్రైవింగ్ నేర్పేవారు. కొన్ని రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న నా భార్య ఎంతో సంతోషించింది. లఖ్‌నవూలో ఉన్న సమయంలో మధు చాలా హుషారుగా ఉంటూ ఏ పనికీ వెనకాడరు. చాలా స్నేహపూర్వకమైన వ్యక్తి.
- 40 ఏళ్ల సర్వీసులో ఎన్నో రోజులు బిపిన్‌తో గడిపాను. అయన రక్షణ రంగంలో అత్యున్నత స్థానంలో సీడీఎస్‌గా ఎంపికవడంతో ఎంతో సంతోషించాను. అతని షెడ్యూలు బిజీగా ఉంటుందని భావించి..నేనే ఫోన్ చేయటానికి సంకోచిస్తుంటాను. కానీ.. ఆయన మాత్రం తరచూ నాతో ఫోన్‌లో మాట్లాడేవారు. దుండిగల్, ఎంసీఎంఈ, సీడీఎంలలో లెక్చర్ ఇవ్వడానికి హైదరాబాద్ కు వస్తే ఎయిర్ పోర్టుకు వెళ్లి చాలాసేపు మాట్లాడుకునేవాళ్లం.