Begin typing your search above and press return to search.

పీవీకి, సత్యానాదెళ్లకు లింక్.. ఎక్కడిదో తెలుసా?

By:  Tupaki Desk   |   29 Jun 2020 6:00 PM GMT
పీవీకి, సత్యానాదెళ్లకు లింక్.. ఎక్కడిదో తెలుసా?
X
పీవీ నరసింహరావు శతజయంతి ఘనంగా జరుగుతోంది. ఆయనకు మైక్రోసాఫ్ట్ సీఈవోగా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజానికి సారథ్యం వహిస్తున్న సత్యనాదెళ్లకు ఏం సంబంధం అని ఆశ్చర్యపోకండి. కానీ సంబంధం ఉంది. సత్యనాదెళ్ల పెళ్లికి నాడు ప్రధాని హోదాలో పీవీ హాజరయ్యాడు. కానీ నాడు సత్యనాదెళ్ల అనామకుడు. సీఈవో కాదు.. మరి ఆయన పెళ్లి నాటి ప్రధాని పీవీ ఎందుకు హాజరయ్యాడన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న..

పీవీ ఏపీలో మంత్రిగా ఉన్న సమయంలో 1967లో రాజమండ్రి సబ్ కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ అప్పట్లో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించాడు. స్వయంగా పరిశీలించిన పీవీ వేణుగోపాల్ పనితనానికి మెచ్చి ఏపీకి సీఎం కాగానే 1971లో ఆయనను సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా స్వయంగా ఎంచుకున్నారు.

ఆ తర్వాత కేంద్రమంత్రిగా పీవీ నరసింహారావు వెళ్లగానే తన పేషీ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ క్రమంలోనే పీవీ 1992లో ప్రధాని అయ్యారు. పీఎంవోలోకి వేణుగోపాల్ ను తీసుకున్నారు. ఆ సమయంలో తన కూతురు అనుపమను సత్యనాదెళ్లకు ఇచ్చి నిశ్చితార్థం ఏర్పాటు చేశాడు వేణుగోపాల్. దానికి పీవీని ఆహ్వానించలేదు.

అయితే తన సెక్రెటరీ కూతురు నిశ్చితార్థం అని తెలుసుకొని మరీ నాటి ప్రధాని పీవీ వచ్చి ఆశీర్వదించారు. తరువాత పెళ్లికి హాజరయ్యారు. ఇలా పీవీ నిరాడంబరత.. అధికారులకు ఆయన ఇచ్చే మర్యాదకు నాడు ప్రశంసలు కురిశాయి. ఇలా సత్యనాదెళ్ల పెళ్లి నాడు ప్రధాని పీవీ హాజరయ్యాడు. అయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన ఆయనకు ఈ విషయం గుర్తుందో లేదో తెలియదు.