Begin typing your search above and press return to search.
కరోనా పై పోరాటం చేస్తున్న మాజీ ప్రధాని కూతురు .. ఎవరంటే !
By: Tupaki Desk | 13 April 2020 8:15 AM GMTభారతదేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి గురించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. బహుభాషా పండితుడైన పీవీ మైనార్టీ ప్రభుత్వాన్ని కూడా ఐదేళ్ల పాటు దిగ్విజయంగా నడిపిన నేర్పరితనం, రాజకీయ చతురత కలిగినవారు. తనవైన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేశారు. ఆయన మన తెలుగు వ్యక్తి కావడం గర్వకారణం.
ఇకపోతే , అంత గొప్ప మహానేత కడుపున పుట్టిన చిన్న కూతురు విజయ ..ప్రస్తుతం కరోనా కారణంగా ఆపదలో ఉన్నవారి కోసం ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ తో పోరాడుతూ వైద్య సేవలందిస్తున్నారు. ఈమె ఇన్ ఫెక్సస్ డిసీజెస్ స్పెషలిస్ట్, అమెరికాలోని విస్కాన్ సిన్ సిటీలోని బిలాయిట్ హాస్పటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయ సోమరాజు. అలాగే యూఐసీ యూనివర్సిటీలో అవుట్ స్టాండింగ్ టీచింగ్ అవార్డు గ్రహీతైన ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో క్లినికల్ ప్రొఫెసర్ గా వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు.
ప్రస్తుతం రోజుకు 12 నుంచి 14 గంటల వరకు పీపీఈ సూట్ ధరించి కరోనా రోగులకు వైద్యసేవ చేస్తున్నారు. కరోనాను జయించడానికి భౌతిక దూరం పాటించడమే అన్నింటి కంటే ముఖ్యమని, ఆలా చేస్తే కరోనా పై విజయం సాధిస్తాం అని ఆమె చెప్పారు. డాక్టర్ విజయ హైదరాబాద్ లోని మాదాపూర్ వెంకటేశ్వర ఫార్మాస్యూటికల్ కాలేజీ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఆమె భర్త ప్రసాద్ సోమరాజు గత 30 ఏళ్లుగా ఆమెరికాలో వైద్యసేవలందిస్తున్నారు. కొతగూడెం సమీపంలోని రేగళ్ల ఆయన స్వగ్రామం.