Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి పీవీ వారసుడు.. ఏ పార్టీలోకి తెలుసా?

By:  Tupaki Desk   |   10 July 2022 6:29 AM GMT
రాజకీయాల్లోకి పీవీ వారసుడు.. ఏ పార్టీలోకి తెలుసా?
X
పీవీ నరసింహరావు.. ఈ తెలుగు బిడ్డ ఏకంగా దేశానికి ప్రధాని అయ్యాడు. సంస్కరణలకు ఆజ్యం పోశాడు. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి పీవీ చేసిన సంస్కరణలే భారత్ ను నిలబెట్టాయి.. ఇప్పుడు అభివృద్ధికి ఊపిరిపోశాయి.అయితే ఆయన వారసత్వం మాత్రం రాజకీయాల్లో అంతగా రాణించలేకపోతోంది. పీవీ కూతురుకు ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చి కేసీఆర్ గౌరవించారు.

దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తనయుడు పీవీ ప్రభాకర్ రావు తాజాగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తండ్రి తరుఫున ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని.. పీవీ స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిన్న జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం బతికిన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఫొటోలను ఇప్పుడు టీఆర్ఎస్ వాడుకుంటోంది. ఎంఎల్‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవిని నిలబెట్టి గెలిపించారు.

ఇక పీవీ తనయుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రభాకర్ రావు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది మాత్రం ఈ సమావేశంలో చెప్పలేదు.

అయితే పీవీ వారసుడు ప్రభాకర్ రావు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలిసింది. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కానీ, ఎంపీ టికెట్ కానీ ఆశిస్తున్నట్టు సమాచారం. మరి ఏ పార్టీలో చేరుతారన్నది వేచిచూడాలి.