Begin typing your search above and press return to search.

ఆ మాత్రం అడగలేకపోయిన తెలుగు సీఎంలు!

By:  Tupaki Desk   |   26 Aug 2016 6:02 AM GMT
ఆ మాత్రం అడగలేకపోయిన తెలుగు సీఎంలు!
X
పీవీ సింధు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించింది. చాలా సంతోషకరమైన విషయం. అందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఆమెకు దాదాపు పదికోట్ల రూపాయలు జమ చేశాయి. మంచిదే. కానీ దానికి ప్రతిగా ఈ రాష్ట్రాల కోసం ఆమె ఏం చేయబోతున్నది? ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి సామాజిక బాధ్యతను పంచుకోబోతున్నది. అదే ఇప్పుడు చిక్కుప్రశ్న.

చివరికి బ్రహ్మకుమారీస్‌ సంస్థ వారు సింధును పిలిచి ఓ సన్మానం చేశారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు కూడా కొన్నిసార్లు ఇక్కడకు వచ్చి వెళ్లానని చెప్పిన సిందు, ఇకపై కూడా అప్పుడడపుడూ వస్తుంటానని, వారి బ్రాండ్‌ అంబాసిడర్‌ లాగా ప్రకటించింది. అదే సమయంలో ఆమె తనకు పది కోట్లిచ్చిన రెండు తెలుగు రాష్ట్రాలకు అదనంగా ఏం చేయబోతోంది. అది మాత్రం క్లారిటీ లేదు.

అదే సమయంలో సాక్షి మాలిక్‌ సంగతి చూద్దాం. కాంస్యపతకం సాధించిన ఆమెకు హర్యానా సర్కారు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చింది. అందుకు ప్రతిగా ఆమెను బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండి , రాష్ట్రంలో తాను పర్యటించే ప్రతిచోటా అమ్మాయిల్లో అవగాహన కల్పించాలని అక్కడ ముఖ్యమంత్రి ఆమెను కోరారు. అందుకు సాక్షి కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ.. ఇక్కడ సింధు పరిస్థితి వేరు. ఆమెకు తెలుగు సీఎంలు ఇద్దరూ పోటీలు పడి సొమ్ములు దఖలు పరిచేశారే తప్ప.. తమ తమ రాష్ట్రాల్లో జరుగుతున్న ఏదో ఒక మంచి ప్రజోపయోగ ప్రయత్నానికి దన్నుగా, బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండమని అడగలేకపోయారు. అదీ మన పరిస్థితి.