Begin typing your search above and press return to search.

సింధూ పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్

By:  Tupaki Desk   |   30 Aug 2019 4:34 AM GMT
సింధూ పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్
X
ఎందరికో సాధ్యం కాని ప్రపంచ బ్యాడ్మింటన్ లో స్వర్ణం సాధించి భారతీయుల దశాబ్ధాల కలను సాకారం చేసింది మన తెలుగమ్మాయి పీవీ సింధూ. భారత్ లోనే ఇప్పుడు అత్యంత విలువైన మహిళా క్రీడాకారిణిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. సింధూ అంటే ఇప్పుడు పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అన్నట్టుగా దేశంలో తయారైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ లో తిరుగులేని రారాణిగా వెలుగొందుతున్న సింధూ వెంట ఇప్పుడు జాతీయ - అంతర్జాతీయ వ్యాపార సంస్థలు పడి ఆమెతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు సింధూ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. బ్రాండ్ లకే బ్రాండ్ గా మారిపోయింది.

ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తూ బ్రాండ్ వాల్యూ కలిగిన క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేస్తుంది. ఈ లిస్ట్ ను పరిశీలిస్తే క్రీడారంగం నుంచి క్రికెటర్లే అధికంగా కనిపిస్తారు. ప్రస్తుతం దేశంలో టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధిక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆయన ఆదాయం దాదాపు 2 కోట్లు పైమాటే.. దేశంలో కోహ్లీనే అగ్రస్థానం. ఆ తర్వాత స్థానంలో నిలిచింది మన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూనే. దాదాపు కోటి 50 లక్షలు తీసుకుంటూ రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుతం మన సింధూ చేతిలో 20 బ్రాండ్ లు ఉన్నాయి. జాతీయ - అంతర్జాతీయ బ్రాండ్ లకు సింధూ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

+సింధూ బ్రాండ్స్ ఇవే..

* చైనాకు చెందిన స్పోర్ట్ మెటీరియల్ సంస్థ ‘లీనీన్గ్’ సింధూతో 2023 వరకు చెల్లుబాటు అయ్యేలా రూ.50 కోట్ల భారీ ఒప్పందం చేసుకుంది. మన దేశంలో ప్రకటనలకు సింధూనే ఈ కంపెనీ తరుఫున కనిపించనుంది.

*ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ‘మింత్రా’ బ్రాండ్ అంబాసిడర్ గా సింధూ ఉన్నారు.

*ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా - కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ ప్రచార దారుగా ఉన్నారు.

*జేబీఎల్ ఇయర్ ఫోన్స్ - బ్రిడ్స్ స్టోన్ టైర్స్ - మూవ్ పెయిన్ రిలీఫ్ అయింట్ మెంట్ - స్పోర్ట్స్ ఎనర్జీ డ్రింక్ గట్రోడ్ - వైజాగ్ స్టీల్స్ - సెంట్రల్ రిజర్వ్ సెక్యూరిటీ ఫోర్స్ - శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ - హర్మన్ ఇంటర్నేషనల్ ఫర్ జీబీఎల్ ఎందూరెన్స్ ఇయర్ ఫోన్స్ - పానసోనిక్ బ్యాటరీస్ - ఎపిస్ హనీ - ఓజాస్విత శ్రీశ్రీ ఆయుర్వేద - యోనెక్స్ - స్ట్రేఫ్రీ - ఫ్లిప్ కార్ట్ - బూస్ట్ వంటి దేశ - విదేశీ బ్రాండ్లకు సింధూ అంబాసిడర్ గా ఉన్నారు.